F2..వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు తోడల్లుడు దొరికాడు..

‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో నవ్వులు పూయించాడో తెలిసిందే కదా. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు. తాజాగా సంక్రాంతికి సూపర్ హిట్టైన ‘ఎఫ్ 2’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ సినిమాను  తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. 

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 21, 2019, 3:33 PM IST
F2..వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు తోడల్లుడు దొరికాడు..
ఎఫ్2 మూవీ
  • Share this:
టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి విడుదలై  ‘ఎఫ్ 2’ సినిమా  ఎవరి అంచనాలకు అందకుండా బ్లాక్ బస్టర్ హిట్టైయింది. ఈ సినిమా దాదాపు రూ.120 కోట్ల గ్రాస్..రూ.80 కోట్ల షేర్‌ను రాబట్టి ట్రేడ్ పండితులను ఔరా అనేలా చేసింది. అంతేకాదు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్స్‌ రాబడుతూనే ఉంది.

‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో నవ్వులు పూయించాడో తెలిసిందే కదా. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు.

తాజాగా సంక్రాంతికి సూపర్ హిట్టైన ‘ఎఫ్ 2’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ సినిమాను  తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సీక్వెల్‌ను కూడా దిల్ ‌రాజు నిర్మించే అవకాశాలున్నాయి.

ఈ సీక్వెల్‌లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు తోడల్లుడుగా నితిన్ నటించబోతన్నట్టు సమాచారం. ముందుగా ఈ  సినిమాలో రవితేజను అనకున్నా..ఫైనల్‌గా మూడో తోడల్లుడుగా నితిన్‌నే ఫిక్స్ చేసినట్టు సమాచారం.త్వరలో ‘ఎప్ 3’ సీక్వెల్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి 

బెడ్రూమ్‌కు వస్తేనే అవకాశం.. యాక్టింగ్ వదిలేసిన హీరోయిన్..

అల్ల‌రి న‌రేష్ ఏంటి ఇలా మారిపోయాడు.. అస‌లు గుర్తు కూడా ప‌ట్ట‌రు..

అక్షయ్ ‘కేసరి’కి.. చరణ్ ‘మగధీర’కు ఉన్న తేడా అదే..

 
First published: February 21, 2019, 3:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading