మహానటి కీర్తి సురేష్‌తో సై అంటోన్న భీష్మ... మరో కొత్త సినిమాకు ఓకే చెప్పిన నితిన్..

ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడేసరికి.. నితిన్ తను చేయబోయే సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ‘భీష్మ’ సినిమాతో పాటు చంద్రశేఖర్ యేలేటి సినిమాలకు ఓకే చెప్పిన నితిన్..తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

news18-telugu
Updated: June 24, 2019, 11:16 AM IST
మహానటి కీర్తి సురేష్‌తో సై అంటోన్న భీష్మ... మరో కొత్త సినిమాకు ఓకే చెప్పిన నితిన్..
నితిన్,కీర్తి సురేష్ జంటగా ‘రంగ్‌దే’ మూవీ
  • Share this:
ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడేసరికి.. నితిన్ తను చేయబోయే సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నితిన్.. రీసెంట్‌గా ‘ఛలో’ సినిమా ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన సంగతి తెలిసిందే కదా. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను సితార ఎంటర్టేన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌ పై ఉండగానే.. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో సినిమాకు కొబ్బరి కాయ కొట్టాడు. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాకు ఓకే చెప్పాడు నితిన్.

Hero Nithin to romance with keerthy suresh Under sithara Entertainments,Tholiprema Fame venky atluri direction,nithiin rangde,nithiin keerthy suresh rangde,nithiin venky atluri rangde movie,nithiin,nithiin twitter,nithiin new movie,nithiin rakul preet singh,nithiin priya varrier,chandra sekhar yeleti,chandrasekhar yeleti,nithin new movie,chandra sekhar yeleti new movie,rana daggubati chandra sekhar yeleti movie,sahasam movie,chandra sekhar yeleti movies,nithiin new movie with chandrashekar yeleti,nithin in chandra shekar yeleti movie,nithin next movie,chandrashekar yeleti new movie with nithiin,nithin chandrashekar yeleti,chandrashekar yeleti movies,nithin with chandrashekar yeleti,telugu cinema,నితిన్ కీర్తి సురేష్ రంగ్ దే,రంగ్ దే వెంకీ అట్లూరి నితిన్ కీర్తి సురేష్, నితిన్,నితిన్ చంద్రశేఖర్ యేలేటి,నితిన్ రకుల్,నితిన్ ప్రియా వారియర్,తెలుగు సినిమా,
నితిన్,కీర్తి సురేష్ జంటగా ‘రంగ్‌దే’ మూవీ


‘రంగ్ దే’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఈ సినిమాను కూడా ‘భీష్మ’ సినిమాను నిర్మిస్తోన్న సితార ఎంటర్టేన్మెంట్ బ్యానర్‌లో తెరకెక్కుతోంది. పీసీ శ్రీరామ్ కెమెరా వర్క్ అందిస్తోన్న ఈ సినిమాను వచ్చే సమ్మర్‌లో రిలీజ్ చేయనున్నారు. మొత్తానికి చాలా కాలంగా ఏ సినిమాలు లేకుండా ఖాళీగా ఉన్న నితిన్.. ఇపుడు వరుసగా మూడు సినిమాలను లైన్‌లో పెట్టడం విశేషం.
First published: June 24, 2019, 11:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading