హీరో నితిన్‌కు కాబోయే భార్య ఈమె నంటూ ఫోటోను షేర్ చేస్తోన్న అభిమానులు..

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ పెళ్లి ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే కదా.  త్వరలోనే ఒకింటివాడు కాబోతున్నాడు. తాజాగా ఈ అమ్మాయి ఫోటో ఇదే అంటూ నితిన్ అభిమానులు ఈ అమ్మాయి ఫోటోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

news18-telugu
Updated: February 14, 2020, 4:22 PM IST
హీరో నితిన్‌కు కాబోయే భార్య ఈమె నంటూ  ఫోటోను షేర్ చేస్తోన్న అభిమానులు..
నాగర్‌కర్నూల్‌లోని ప్రగతి నర్సింగ్‌ హోమ్‌ నిర్వహిస్తున్న డాక్టర్‌ సంపత్‌ కుమార్‌, నూర్జహాన్ కుమార్తె షాలినితో ఈ మధ్యే నితిన్‌కు నిశ్చితార్థం జరిగింది.
  • Share this:
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ పెళ్లి ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే కదా.  త్వరలోనే ఒకింటివాడు కాబోతున్నాడు. ఇక నితిన్‌ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు షాలిని. ఏప్రిల్‌లో పెళ్లి జరనుంది. తాజాగా నితిన్‌కు కాబోయే అమ్మాయి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటో విషయమై నితిన్ క్లారిటీ ఇస్తే కానీ అవునో కాదో చెప్పలేము. ఈ శనివారం హైదరాబాద్ నితిన్ నివాసంలో పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో పాటు సినీ రంగానికి సంబంధించి కొంత మంది హాజరయ్యే అవకాశాలున్నాయి. నితిన్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నాడు. ఈయన పెళ్లి ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్‌లో నిర్వహించనున్నట్టు సమాచారం. ఇవన్ని పక్కన పెడితే.. నితిన్ బ్యాచిలర్ ఉంటూ నటించిన చివరి సినిమా ‘భీష్మ’ ఈ నెల 21న విడుదల కానుంది.

hero nithiin wife shalini photo go viral on social media,Nithiin,Nithiin engagement feb 15,Nithiin twitter,Nithiin instagram,Nithiin marriage date,Nithiin bheeshma movie,Nithiin rashmika mandanna,Nithiin rang de keerthi suresh,Nithiin rakul preet singh,Nithiin marriage 2020,Nithiin shalini marriage,Nithiin marriage 2020 april 16,prabhas marraige,rana daggubati marriage,నితిన్,నితిన్ పెళ్లి,నితిన్ నిశ్చితార్థం,నితిన్ శాలిని పెళ్లి,
నితిన్ కాబోయే ఈమె నంటూ సోషల్ మీడియాలో ఫోటో వైరల్ (Facebook/Photo)


ఈ చిత్రంలో పెళ్లంటే దూరంగా పారిపోయే బ్రహ్మచారి పాత్రలో నటిస్తున్నాడు. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దీనికి దర్శకుడు. ఈ చిత్రంతో పాటు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చదరంగం.. వెంకీ అట్లూరీతో రంగ్ దే సినిమాలకు కమిటయ్యాడు నితిన్. ఏదేమైనా కూడా వరస సినిమాలతో పాటు లైఫ్‌లో కూడా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని చూస్తున్నాడు నితిన్. మొత్తానికి పెళ్లికి ముందే ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసి కొన్ని రోజులు మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలని చూస్తున్నాడు ఈ కుర్ర హీరో.
Published by: Kiran Kumar Thanjavur
First published: February 14, 2020, 4:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading