హీరో నితిన్‌కు దైవ భక్తి ఎక్కువైంది. అంటే ఇంతకు ముందు ఆయనకు దేవుడంటే నమ్మకం లేదా! అని అనుకోకండి. ఆయనేం నాస్తికుడు కాదు. దేవుడంటే భక్తే.. కానీ ఈ మధ్య అది కాస్త ఎక్కువైనట్లు అనిపిస్తుంది. భక్తి విషయంలో హీరో నితిన్ తన అభిమాన హీరో పవన్‌కల్యాణ్‌ను ఫాలో అవుతుంటారు. సినిమాలు లేనప్పుడు సింపుల్‌గా ఉంటూ.. వీలైనప్పుడు గుళ్లు గోపురాలకు తిరుగుతుంటాడు నితిన్.. పవన్‌కల్యాణ్‌లా దైవ దీక్షలు చేస్తుంటాడు. అందుకు ఉదాహరణ భీష్మ షూటింగ్ సమయంలో నితిన్ ఆంజనేయ స్వామి దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ప్రతి సినిమా పూర్తి కాగానే ఆయన ఏడు కొండలవాడిని దర్శనం చేసుకోవడం అలవాటుగా చేసుకున్నాడు. అందులో భాగంగా రీసెంట్‌గా తన రంగ్ దే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న నితిన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
హైదరాబాద్ నుండి తిరుపతి కారులో సతీమణి షాలినితో కలిసి వచ్చిన నితిన్.. ఆమెను కారులో తిరుమలకు పంపి.. తను మాత్రం కాలినడకన శ్రీవారి ఆలయాన్ని చేరుకున్నారు. రెండున్నర గంటల్లోనే నితిన్ కొండను ఎక్కేశాడు. నితిన్ కాలినడకన వెళ్లడాన్ని ఓ భక్తుడు వీడియో తీసి దాన్ని తన ట్విట్టర్‌లో షేర్ చేస్తే దానికి నితిన్ ఓం నమో వేంకటేశాయ స్పందిస్తూ రీ ట్వీట్ చేశారు. తాను రెండున్నర గంటల్లోనే తిరుమల కొండను కాలినడకన ఎక్కానని తన సోషల్ మీడియా ద్వారా నితిన్ వెల్లడించారు.

Hero Nithiin Follwing his hero Pawan Kalyan in Bakthi full deatails are here
ప్రస్తుతం నితిన్ రంగ్ దే షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా మార్చి 26న విడుదలకు సిద్ధమవుతోంది. దీని తర్వాత చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలోనూ చెక్ సినిమాను దాదాపు పూర్తి చేసేశాడు. ఇది కూడా ఈ ఏడాదిలోనే విడుదలవుతుందని సినీ వర్గాల సమాచారం. అలాగే రీసెంట్‌గా దుబాయ్‌లో బాలీవుడ్ మూవీ అంధాదున్ రీమేక్ షూటింగ్‌ను స్టార్ట్ చేశాడు.