Home /News /movies /

HERO NAVEEN CHANDRA SHOCKING COMMENTS ON NANDAMURI BALAKRISHNA SB

Balakrishna: బాలయ్యకు ముద్దు పెట్టాలనిపించింది.. యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్

Photo Twitter

Photo Twitter

బాలయ్యకు వీరాభిమానులు ఉన్నారు. నందమూరి ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే బాలయ్యకు సిని ప్రముఖుల్లో ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

    బాలకృష్ణ (Balakrishna) ఎంతమంది అభిమానులు ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు. ఇక సినిమా సెలబ్రిటీల్లో కూడా చాలామంది బాలకృష్ణకు ఫ్యాన్స్. ఇటీవలే విక్టరీ వెంకటేష్ సైతం... ఎఫ్3 ప్రమోషన్లలో జై బాలయ్య అంటూ... స్టేజ్ పై సందడి చేశారు. బాలయ్య ఇటు సినిమాలు చేస్తూ.. అటు రాజకీయాలు కూడా చేస్తూ బిజీగా మారాడు. తాజాగా అన్ స్టాపబుల్ అనే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తు హోస్ట్ గా తన సత్తాను నిరూపించుకున్నాడు బాలయ్య. ఇదిలా ఉంటే ఇటీవలే ఒక యువ నటుడు బాలయ్య మీద ఉన్న అభిమానంతో ఆయన ఏకంగా ముద్దు పెట్టుకోవాలి అనిపించింది అని తెలిపారు.  తాజాగా మరో హీరో బాలకృష్ణపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు.

    అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన యంగ్ హీరో నవీన్ చంద్ర(Naveen Chandra). మొదటి సినిమాతో మంచి నటుడిగా మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించాడు. కొందరు హీరోల సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కూడా నటించారు. తాజాగా నందమూరి బాలకృష్ణ సినిమాలో కూడా నటించిన విషయం తెలిసిందే.అదే విధంగా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా నవీన్ చంద్ర ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నారు అని తెలుస్తోంది.

    ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నవీన్ చంద్ర ఆ సినిమాలో తన పాత్ర గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. ఈ సినిమాలో తన పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది అని తెలిపారు.అనంతరం బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలకృష్ణ లాంటి హీరోను ఇంతవరకు చూడలేదని, బాలకృష్ణ తో పని చేయడం మర్చిపోలేని అనుభూతి అని తెలిపాడు. అయితే సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణతో అలా ట్రావెల్ అవుతున్న తర్వాత కొన్ని సమయాల్లోనే ఆయన తనకు చాలా ముద్దొచ్చారని చెప్పాడు నవీన్ చంద్ర. అంతేకాదు ఒకసారి అయితే ఏకంగా ముద్దు పెట్టాలని కూడా అనిపించింది అని చెప్పుకొచ్చాడు. దీంతో నవీన్ చంద్ర చేసిన కామెంట్స్ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

    బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను ఎట్టకేలకు ఫిక్స్ చేశారు. జై బాలయ్య అనే పేరును పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్. బాలయ్యకు తగినట్లుగా ఎలివేషన్ సీన్లు, పొలిటకల్ పంచులు ఇందులో పుష్కలంగా ఉంటాయట. స్క్రిప్టు కూడా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుందని సమాచారం.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Balakrishna, Nandamuri balakrishna

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు