హోమ్ /వార్తలు /సినిమా /

ఆ భయంతో థియేటర్ లోనే ప్యాంట్ తడిచిపోయింది.. టాప్ సీక్రెట్ చెప్పిన నాని

ఆ భయంతో థియేటర్ లోనే ప్యాంట్ తడిచిపోయింది.. టాప్ సీక్రెట్ చెప్పిన నాని

Photo Twitter

Photo Twitter

Ante Sundaraniki Promotions: నాని హీరోగా నటించిన అంటే సుందరానికి మూవీ జూన్ 10వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు మేకర్స్. ఈ మేరకు ప్రమోషన్స్‌తో బిజీ అయిన హీరో నాని.. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఈ సినిమా విశేషాలతో పాటు అనేక ఆసక్తికర విషయాలు బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన లైఫ్ లోని ఓ టాప్ సీక్రెట్ రివీల్ చేశారు నాని.

ఇంకా చదవండి ...

నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా 'అంటే సుందరానికి' (Ante Sundaraniki). ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ కలర్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ విడుదలకు సిద్ధమైంది. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ జూన్ 10వ తేదీన విడుదల (Ante Sundaraniki Release Date) కాబోతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు మేకర్స్. ఈ మేరకు ప్రమోషన్స్‌తో బిజీ అయిన హీరో నాని.. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఈ సినిమా విశేషాలతో పాటు అనేక ఆసక్తికర విషయాలు బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన లైఫ్ లోని ఓ టాప్ సీక్రెట్ రివీల్ చేశారు నాని.

ఓ సారి సినిమా థియేటర్లో సినిమా చూస్తూనే ప్యాంట్ తడిపేసుకున్న విషయాన్ని నాని చెప్పడం గమనార్హం. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన చెప్పిన ఈ మ్యాటర్ సినీ సర్కిల్స్‌లో వైరల్‌గా మారింది. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న నాని తన పర్సనల్ లైఫ్ లోని మరపురాని సంఘటన గురించి వివరించారు. అప్పట్లో ఒక సినిమాకు వెళ్ళవద్దని ఇంట్లో వాళ్ళు చెప్పినా వినకుండా తన స్నేహితులతో కలిసి ఆ సినిమాకు వెళ్ళాడట నాని. అయితే ఆ మూవీ చూసి భయంతో ప్యాంట్ కూడా తడిసిపోయిందని చెబుతూ ఆయన ఓపెన్ అయ్యారు.

ఇంతకీ నాని ప్యాంట్ తడిపిన ఆ సినిమా ఏంటంటే.. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మూవీ దెయ్యం. అప్పట్లో ఈ సినిమాకు అందరినీ తెగ భయపెడుతూ మంచి క్రేజ్ సంపాదించింది. ఇదే సినిమాకు తన స్నేహితుడితో వెళ్లిన నానికి.. చిత్రంలోని కొన్ని సన్నివేశాలు చూస్తుంటే భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయట. ఇంతలో సడన్‌గా చేతిలో పట్టుకున్న కూల్ డ్రింక్ ప్యాంటుపై పడటంతో ప్యాంట్ మొత్తం తడిచిపోయిందని, ఇది చూసి తన స్నేహితుడు తెగ నవ్వేశాడని చెప్పారు నాని.

రీసెంట్‌గా శ్యామ్ సింగరాయ్ సినిమాతో పలకరించిన నాని.. ఇప్పుడు 'అంటే సుందరానికి' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. దీంతో పాటు దసరా అనే మరో సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాని. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కావడంతో రిలీజ్ డేట్ వేట కొనసాగిస్తున్నారు. అతి త్వరలో ఈ దసరా ఎప్పుడనేది ప్రకటించనున్నారట మేకర్స్.

First published:

Tags: Ante sundaraniki, Hero nani, Tollywood

ఉత్తమ కథలు