పరీక్షల్లో స్లిప్పులు పెట్టి రాయడం, అలాగే ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే ఎక్కడ దొరికిపోతామో అని నాన్న సంతకాన్ని ఫోర్జరీ చేసి పెట్టేయడం, కాలేజీ బంక్ కొట్టేసి సినిమాకెళ్ళడం.. ఇవ్వన్నీ ప్రతి ఒక్క వ్యక్తి జీవితాల్లో ఎప్పుడో ఓసారి చోటుచేసుకునే సంఘటనలే. సరిగ్గా ఇలాంటివే నాని (Hero Nani) జీవితంలో చాలా ఉన్నాయట. ఇప్పుడు ఇవ్వన్నీ బయటపెడుతూ ఓపెన్ అవుతున్నారు ఈ నాచురల్ స్టార్. తన కొత్త సినిమా అంటే సుందరానికి (Ante Sundaraniki) ప్రమోషన్స్ కాస్త వెరైటీగా చేపడుతూ నానా హంగామా చేస్తున్నారు నాని. సినిమా విశేషాలతో పాటు తన చిన్నప్పటి సంగతులు చెబుతూ వరుసపెట్టి సీక్రెట్స్ అన్నీ రివీల్ చేస్తున్నారు. దీంతో ఈ సుందరానికి బెస్ట్ ప్రమోషన్ దక్కడంతో పాటు నాని వీడియోస్ యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి.
నాని హీరోగా వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా 'అంటే సుందరానికి'. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ కలర్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ విడుదలకు సిద్ధమైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ జూన్ 10వ (Ante Sundaraniki Release Date) తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు మేకర్స్. ఈ మేరకు ప్రమోషన్స్‌తో బిజీ అయిన హీరో నాని.. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన వ్యక్తిగత జీవితం తాలూకు విషయాలతో పాటు ఇష్టాయిష్టాల గురించి ఓపెన్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో తన చిన్ననాటి సంగతి గుర్తు చేసుకున్నారు నాని. తాను చదువులో చాలా వీక్ అని చెప్పిన ఆయన.. చదువుకునే రోజుల్లో తనకు ఇంగ్లీష్ సరిగా వచ్చేది కాదని చెప్పారు. ప్రతి ప్రశ్నకు 'టైటానిక్' సినిమా కథ రాసేవాడినని, లక్కీగా వాటికే మార్కులు పడి మంచి మార్కులు వచ్చేవని తెలిపారు. అదేవిధంగా తనకు పరీక్షలంటే చాలా భయం ఉండేదని, షూస్‌లో స్లిప్పులు పెట్టుకుని పరీక్షలకు వెళ్ళేవాడినని అన్నారు. చిట్టీలు కొడుతూ కొన్నిసార్లు దొరికిపోయా కానీ డీబార్ కాలేదని తెలిపారు. ఇక ప్రోగ్రెస్ కార్డులో తన తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసిన రోజు కూడా ఒకటుందని నాని చెప్పారు.
రీసెంట్గా శ్యామ్ సింగరాయ్ సినిమాతో సక్సెస్ అందుకున్న నాని.. ఇప్పుడు 'అంటే సుందరానికి' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. దీంతో పాటు దసరా అనే మరో సినిమా చేస్తున్న ఆయన త్వరలోనే ఈ సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ante sundaraniki, Hero nani, Tollywood