Home /News /movies /

HERO NANI RELEASE A NOTE ON SOCIAL MEDIA AND EXPLAINS ABOUT TUCK JAGADISH RELEASE SSR

Hero Nani: టాలీవుడ్‌లో హీరో నాని లేఖ కలకలం.. పాపం.. ఎంత బాధను కడుపులో దాచుకున్నాడో..

హీరో నాని

హీరో నాని

నేచురల్ స్టార్ నాని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ లేఖపై ప్రస్తుతం అటు టాలీవుడ్‌లో, ఇటు ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తన తాజా చిత్రం ‘టక్ జగదీష్’ను ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించడంపై ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నాని ఈ నోట్‌ను విడుదల చేశాడు.

ఇంకా చదవండి ...
    నేచురల్ స్టార్ నాని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ లేఖపై ప్రస్తుతం అటు టాలీవుడ్‌లో, ఇటు ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తన తాజా చిత్రం ‘టక్ జగదీష్’ను ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించడంపై ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నాని ఈ నోట్‌ను విడుదల చేశాడు. సినిమాలను థియేటర్‌లోనే చూసేందుకు ఇష్టపడే అభిమానుల్లో తానూ ఒకడినని, థియేటర్‌ హౌస్‌ఫుల్ అయి.. అంత మంది మధ్య సినిమా చూస్తుంటే ఒక పండగలా ఉంటుందని నాని చెప్పుకొచ్చాడు. ‘టక్ జగదీష్’ కూడా అలా థియేటర్‌లో హౌస్‌ఫుల్ ఆడియన్స్ మధ్య కూర్చుని చూడదగిన సినిమా అని చెప్పాడు. అయితే.. ‘టక్ జగదీష్’ సినిమాకు నిర్మాతలు భారీగా ఖర్చుపెట్టారని.. నిర్మాతలపై ఒత్తిడి పెరిగిపోవడంతో రిస్క్ చేయలేని పరిస్థితి ఉందని నాని ఆ నోట్‌లో పేర్కొన్నాడు. ‘టక్ జగదీష్’ను నిర్మాతలు రిస్క్ తీసుకుని థియేటర్లలో విడుదల చేసినా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు రాకపోతే నష్టపోయే ప్రమాదం ఉందని నాని పరోక్షంగా చెప్పాడు. విదేశాల్లో, మన దేశంలో కూడా నెలకొన్న కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల.. పైగా ఆంధ్రాలో థియేటర్లపై విధించిన కొన్ని ఆంక్షల వల్ల.. ఇలా చాలా విధాలుగా ‘టక్ జగదీష్’కు అవరోధాలు ఉన్నాయని నాని తెలిపాడు. నిర్మాతలంటే తనకు అపారమైన గౌరవం ఉందని.. సినిమా విడుదలపై ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం తెలపనన్నట్టుగా నాని చెప్పాడు.

    ‘టక్ జగదీష్’పై నిర్ణయం తీసుకునే అవకాశాన్ని పూర్తిగా ‘షైన్ స్క్రీన్స్’కే వదిలేస్తున్నానని.. మిగతా వారు కూడా ఆ నిర్ణయాన్ని హుందాగా స్వీకరించాలని నాని చెప్పాడు. ఏదేమైనా.. తాను ‘టక్ జగదీష్’ సినిమాకు 100 శాతం కష్టపడ్డానని.. ఎక్కడ విడుదలైనా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని నాని తన నోట్‌ను ముగించాడు. మొత్తం మీద నాని చెప్పొచ్చేదేంటంటే.. ‘టక్ జగదీష్’ సినిమా ఓటీటీలో విడుదల చేయనున్నారని పరోక్షంగా చెప్పేశాడు.



    ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ‘అమెజాన్ ప్రైమ్’ ఇప్పటికే ‘టక్ జగదీష్’ చిత్ర నిర్మాతలతో పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఓటీటీ ధర, శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ మొత్తం కలుపుకుంటే.. ‘టక్ జగదీష్’ సినిమా కాస్తంత లాభానికే అమ్ముడుపోయినట్లు సమాచారం.

    ఇది కూడా చదవండి: Love Story: ‘లవ్‌స్టోరి’ సినిమా టీంకు ‘VINAKAYA CHAVITI’ సెగ.. ఇదేంటంటూ సినిమా టీంపై నెటిజన్ల మండిపాటు..

    కరోనా నేపథ్యంలో ప్రేక్షకులు థియేటర్లకు రాకపోతే కోట్లకు కోట్లు పెట్టి సినిమా తీసిన నిర్మాతలు, ఆ సినిమా హక్కులు సొంతం చేసుకున్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయే అవకాశం ఉందన్న ఆందోళన వల్లే నాని తాజా సినిమాను మేకర్స్ ఓటీటీకి అమ్మేసుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. ‘టక్ జగదీష్‌’తో పాటు శేఖర్ కమ్ముల తాజా చిత్రం ‘లవ్‌స్టోరి’ కూడా ఓటీటీలోనే విడుదల అవుతుందని అంతా భావించారు. అయితే.. తమ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు ‘లవ్‌స్టోరి’ టీం ప్రకటించింది. తాజాగా.. సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేయనున్నట్టుగా కూడా విడుదల తేదీని ప్రకటించింది. ఇటీవల థియేటర్లు తెరుచుకున్నాక తెలుగులో విడుదలైన తొలి సినిమా ‘ఎస్‌ఆర్ కల్యాణ మండపం’. ఈ సినిమా చెప్పుకోవడానికి చిన్న సినిమానే అయినప్పటికీ చెప్పుకోదగ్గ వసూళ్లనే రాబట్టింది. థియేటర్లకు ప్రేక్షకులు తప్పకుండా వచ్చి సినిమాలు చూస్తారన్న నమ్మకాన్ని టాలీవుడ్ నిర్మాతలకు కలిగించింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Hero nani, Natural star nani, Telugu Cinema News, Telugu Movie News, Tollywood, Tuck Jagadish

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు