జెర్సీ సక్సెస్ తర్వాత మళ్లీ జోరు పెంచేసాడు నాని. వరస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పుడు ఈయన గ్యాంగ్ లీడర్ సినిమా సెట్లో బిజీ బిజీగా ఉన్నాడు. విక్రమ్ కే కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తైపోయింది. అయితే ఈ మధ్యే షూటింగ్ జరుగుతున్న సమయంలో నానికి చిన్న యాక్సిడెంట్ అయింది. దాంతో ఆయన కాలికి గాయమైంది. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు చిత్ర యూనిట్. పరిశీలించిన డాక్టర్లు ప్రమాదం ఏం లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు దర్శక నిర్మాతలు.
ఐదుగురు ఆడవాళ్ల చుట్టూ జరిగే కథ ఈ సినిమా. ఇందులో నాని దొంగగా నటిస్తున్నాడని తెలుస్తుంది. మరోసారి పూర్తిగా స్క్రీన్ ప్లే మ్యాజిక్‌తోనే ఈ సినిమా కథ నడపనున్నాడు విక్రమ్ కే కుమార్. జెర్సీ తర్వాత మరోసారి అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే నానికి గాయం కావడంతో ప్రస్తుతానికి షూటింగ్ క్యాన్సిల్ అయింది. 10 రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ సెట్‌కు రానున్నాడు నాని.
అప్పటి వరకు ఇంట్లో రెస్ట్ తీసుకోవడమే. ఈ చిత్రంతో పాటు మరో మూడు సినిమాలకు కూడా కమిట్మెంట్ ఇచ్చాడు నేచురల్ స్టార్. మొత్తానికి అనుకోని సెలవులు దొరకడంతో ఇంట్లో కొడుకు అర్జున్‌తో ఆడుకుంటున్నాడు నాని. అభిమానులు మాత్రం ఆయనకు త్వరగా నయం కావాలని కోరుకుంటున్నారు. చిన్న దెబ్బలే కావడంతో ప్రస్తుతానికి ఎలాంటి సమస్యా లేదంటున్నారు వైద్యులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nani, Telugu Cinema, Tollywood