హోమ్ /వార్తలు /సినిమా /

Nandamuri Balakrishna: ‘మా’ రచ్చపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చేశారా ?

Nandamuri Balakrishna: ‘మా’ రచ్చపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చేశారా ?

బాలకృష్ణ (File/Photo)

బాలకృష్ణ (File/Photo)

Nandamuri Balakrishna: తన టాక్ షో లాంచ్ సందర్భంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మా ఎన్నికల గొడవలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేశారా ? లేక ? మెగా, నందమూరి కుటుంబాల మధ్య ఉండే సినీ పోటీ గురించి చేశారా ? అన్నది చర్చనీయాంశంగా మారింది.

  తొలిసారిగా ఓ టాక్ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తున్న నందమూరి బాలకృష్ణ.. ఈ షోను లాంచ్ చేశారు. ఆహా కోసం ఈ షో చేయడం ఆనందంగా ఉందన్న బాలకృష్ణ.. అనేక జాతీయ, అంతర్జాయతీయ ఓటీటీలకు ధీటుగా ఆహా కూడా ఎదగాలని ఆకాంక్షించారు. అల్లు అరవింద్ సారథ్యంలోని ఆహాలో బాలకృష్(Nandamuri Balakrishna) టాక్ షో అనడంతో.. ఈ షోపై ఉన్న ఆసక్తి మరింతగా పెరిగింది. ఇక ఈ షో లాంచ్ సందర్భంగా అనేక విషయాలపై మాట్లాడిన బాలకృష్ణ.. సినీ ఇండస్ట్రీలో పోటీపై కూడా కామెంట్ చేశారు. ఇండస్ట్రీలో పోటీ ఉంటుందని.. ఉండాలని అన్నారు. అలాంటప్పుడే మంచి ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించారు. అయితే అది కేవలం సినిమాలకు, రాజకీయాలకు మాత్రమే పరిమితం కావాలని బాలకృష్ణ అన్నారు. బావిలో కప్పల మాదిరిగా అక్కడే ఉండిపోవద్దని సూచించారు.

  బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్‌లో కొనసాగుతున్న మా (Maa Elections) వివాదంపైనే బాలకృష్ణ ఈ రకంగా పరోక్ష వ్యాఖ్యలు చేశారనే టాక్ వినిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు(Manchu Vishnu), ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మధ్య ఉత్కంఠభరితమైన పోటీ జరిగింది. ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు.

  అయితే ఎన్నికల తరువాత కూడా మా ఎన్నికల రగడ కొనసాగుతోంది. గెలిచిన తరువాత ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామా చేయడంతో.. మళ్లీ వివాదం మొదలైంది. ఇంకా అది కొనసాగుతోంది. అయితే ఇదే సందర్భంలో మోహన్ బాబు, మంచు విష్ణు బాలకృష్ణను కలిసి తమకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

  Maa Elections 2021: మా ఎన్నికల ఎఫెక్ట్.. ఆ నినాదం ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఉంటుందా ?

  YS Jagan: జగన్‌ను టెన్షన్ పెడుతున్న వైఎస్ఆర్ సన్నిహితుడు.. వైసీపీలో టెన్షన్

  ఆ తరువాత తన టాక్ షో లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన బాలకృష్ణ.. మా ఎన్నికల గొడవలపై పరోక్ష వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది. ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే విధంగా బాలకృష్ణ తనదైన శైలిలో అందరికీ సూచించారు. మొత్తానికి తన టాక్ షో లాంచ్ సందర్భంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మా ఎన్నికల గొడవలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేశారా ? లేక ? మెగా, నందమూరి కుటుంబాల మధ్య ఉండే సినీ పోటీ గురించి చేశారా ? అన్నది చర్చనీయాంశంగా మారింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Balakrishna, MAA Elections

  ఉత్తమ కథలు