సమంత ఫసక్ అన్న నాగ్.. మన్మథుడు 2 వస్తే అంతేనట..

Manmadhudu 2 : నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మన్మథుడు 2’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

news18-telugu
Updated: August 5, 2019, 9:24 AM IST
సమంత ఫసక్ అన్న నాగ్.. మన్మథుడు 2 వస్తే అంతేనట..
నాగార్జున,సమంత
news18-telugu
Updated: August 5, 2019, 9:24 AM IST
మన్మథుడు-2 ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున హుషారెత్తించాడు. అగస్టు 9న తాను రాబోతున్నానని.. ఇక నాగచైతన్య, సమంత ఫసక్ అని సరదాగా అందరినీ నవ్వించారు. సమ్మర్‌లో తమ పెద్దబ్బాయి చైతన్య 'మజిలీ'తో వచ్చాడని.. మొన్న 'ఓ బేబీ' సినిమాతో కోడలు సమంత వచ్చిందని.. ఇక అగస్టు 9న తానొస్తున్నానని.. చెప్పారు. అప్పుడు ఆ రెండు సినిమాలు ఫసక్ అన్నారు. మన్మథుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, కుటంబ సమేతంగా చూడవచ్చని చెప్పారు. మన్మథుడు2 సినిమా కథ ఓ ఫ్రెంచ్ సినిమా నుంచి తీసుకున్నట్టు చెప్పారు. కథ వినగానే.. తానేంటి ఈ వయసులో లవ్ స్టోరీ ఏంటి అనుకున్నానని తెలిపారు. అయితే ఇది తన వయసుకు తగ్గ సినిమా అని.. ప్రేమకు,రొమాన్స్‌కు వయసు లేదని చెప్పే సినిమా అని అన్నారు. అందరూ తనకు ఇద్దరు కొడుకులు ఉన్నారని అనుకుంటున్నారని.. సినిమా చూశాక ఉన్నది ఇద్దరు తమ్ముళ్లు అనుకుంటారని సరదా కామెంట్ చేశారు.

ఒరిజినల్ మన్మథుడుకి ఆడవాళ్లంటే పడదు అని.. కానీ ఈ మన్మథుడికి ఆడవాళ్లంటే ఇష్టమని చెప్పారు. కాగా, నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మన్మథుడు 2’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. చైతన్ భరద్వాజ్ సినిమాకు సంగీతం అందించారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు నటీనటులు నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, నాగచైతన్య, సీనియర్ నటి లక్ష్మి, అమల, వెన్నెల కిషోర్, తదితరులు హాజరయ్యారు.

First published: August 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...