హోమ్ /వార్తలు /సినిమా /

రామ్ చరణ్ బాటలో... మంచు మనోజ్

రామ్ చరణ్ బాటలో... మంచు మనోజ్

మంచు మనోజ్(ఫేస్‌బుక్ ఫోటో)

మంచు మనోజ్(ఫేస్‌బుక్ ఫోటో)

ఇటీవలే తన భార్యకు విడాకులు కూడా ఇచ్చిన మంచు మనోజ్ తన జీవితానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు.

దీపావళి సందర్భంగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీపావళి పండగ రోజున తన సినీ జీవితాన్ని సరికొత్తగా పునఃప్రారంభిస్తున్నాంటూ ట్వీట్ పెట్టారు. కొంతకాలంగా మంచు మనోజ్ కుటుంబపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవలే తన భార్యకు విడాకులు కూడా ఇచ్చానని తెలిపాడు. రెండేళ్ల తమ అందమైన బంధానికి ముగింపు పలికామని.. తమ మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయని తన అభిమానులతో పంచుకున్నాడు. వాటి వల్ల చాలా నొప్పిని కూడా అనుభవించామని తెలియజేసాడు మనోజ్.  ఇద్దరం విడిపోవడానికి నిశ్చయించుకొనే విడాకులు తీసుకున్నామన్నాడు. దీనిపై తన అభిమానులకు సోషల్ మీడియా వేదికగా ఒక లెటర్ కూడా పోస్టు చేశాడు.

భార్యకు విడాకులు తర్వాత కాస్త రిలీఫ్ గా ఫీలైన మనోజ్ ఇకపై తన ఆనందాన్ని సినిమా రంగంలోనే వెతుక్కుంటానని అభిమానులకు తెలిపాడు. అయితే ఈసారి నిర్మాతగా మారుతున్నట్లు మంచు మనోజ్ ఆసక్తి చూపించాడు. దీపావళి సందర్భంగా తన పేరు కలిసొచ్చేలా ఎంఎం ఆర్ట్స్ బ్యానర్ స్థాపించాడు. బ్యానర్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాడు. తన సొంత బ్యానర్ ద్వారా కొత్త ప్రతిభను పరిచయం చేస్తానని తెలిపాడు. రానున్న రోజుల్లో మంచి సినిమాలు తన బ్యానర్ నుంచి వస్తాయన్నాడు మంచు మనోజ్.

First published:

Tags: Manchu Family, Manchu Manoj, Tollywood, Tollywood Movie News, Tollywood news

ఉత్తమ కథలు