విజయ్ దేవరకొండకు చేయూతగా హీరో కార్తికేయ విరాళం.. తోడుగా కొరటాల శివ..

చేసినవి కొన్ని సినిమాలైనా.. వాటితోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. తాజాగా హీరో కార్తికేయతో పాటు కొరటాల శివ విజయ్ దేవరకొండకు అండగా నిలిచారు.

news18-telugu
Updated: April 26, 2020, 5:03 PM IST
విజయ్ దేవరకొండకు చేయూతగా హీరో కార్తికేయ విరాళం.. తోడుగా కొరటాల శివ..
విజయ్ దేవరకొండగా అండగా నిలిచిన కార్తికేయ, కొరటాల శివ (Twitter/Photo
  • Share this:
చేసినవి కొన్ని సినిమాలైనా.. వాటితోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. తాజాగా కరోనాపై పోరాటంలో సామాన్య ప్రజలను ఆదుకోవడానికి రూ. కోటి ముప్పై లక్షల విరాళం ప్రకటించాడు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో మాములు ప్రజలకు సాయం అందించడానికి రెండు ఛారిటీ సంస్థలను ఏర్పాటు చేసి తనదైన ముద్ర వేసుకున్నాడు.ఈ విపత్కర పరిస్థితుల్లో నిత్యావసరాలు లేక ఇబ్బందులు పడుతున్న వారి కోసం రూ. 25 లక్షల రూపాయలతో మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేసాడు. మిగిలిన డబ్బులతో  యూత్‌కు ఎంప్లాయిమెంట్ కోసం ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. మిడిల్ క్లాస్ ఫండ్‌లో భాగంగా ఎవరికైనా నిత్యావసరలు లేక అవస్థలు పడుతున్న వారు ఈ వెబ్‌సైట్‌లో   https://thedeverakondafoundation.org లాగిన్ అయి తమ వివరాలు నమోదు చేసుకుంటే వాళ్ల వాలంటీర్లే స్వయంగా సభ్యులకు నిత్యావసరాలు అందిస్తారట. దాదాపు 2 వేల కుటుంబాలకు సంబంధించిన అవసరాలను ఎం.సి.ఎఫ్ ట్రస్ట్ తీర్చే విధంగా దీన్ని రూపకల్పన చేసారు. తాజాగా విజయ్ దేవరకొండ ఏర్పాటు చేసిన ఫండ్‌కు తన వంతుగా లక్ష రూపాయల సాయం చేసాడు RX 100 ఫేమ్ కార్తికేయ. దాంతో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా విజయ్ దేవరకొండ చేస్తోన్న ప్రయత్నానికీ తన వంతు సహకారం అందిస్తున్నారు. అంతేకాదు దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా విజయ్ దేవరకొండ స్టార్ట్ చేసిన పనిని మెచ్చుకున్నాడు.

Published by: Kiran Kumar Thanjavur
First published: April 26, 2020, 4:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading