యాంకర్ రవి ప్రేమ పాఠాలు.. ఫిదా అవుతున్న అభిమానులు..

Anchor Ravi: యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. దాంతో పాటు సినిమాలు కూడా చేసాడు. అయితే హీరోగా మాత్రం సక్సెస్ కాలేదు రవి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 1, 2020, 7:41 PM IST
యాంకర్ రవి ప్రేమ పాఠాలు.. ఫిదా అవుతున్న అభిమానులు..
యాంకర్ రవి ఫైల్ ఫోటో (Anchor Ravi music video)
  • Share this:
యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. దాంతో పాటు సినిమాలు కూడా చేసాడు. అయితే హీరోగా మాత్రం సక్సెస్ కాలేదు రవి. దాంతో ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తున్నాడు యాంకర్ రవి. ఇందులో భాగంగానే ఈయన ఓ పాట విడుదల చేసాడు. చాలా రోజుల నుంచి ఆయన పాటకు ప్రమోషన్స్ చేస్తున్నారు. జబర్దస్త్ టీంతో పాటు శేఖర్ మాస్టర్, రోజా లాంటి వాళ్లు కూడా రవి పాట గురించి అంతా ప్రమోషన్ చేసారు. ఇప్పుడు ఈయన నటించిన సమయమే తెలియదే అనే పాట విడుదలైంది. దీనికి చిట్టి మాస్టర్ కొరియోగ్రఫీ చేసాడు. విడుదలైన విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి.
యాంకర్ రవి ఫైల్ ఫోటో (Anchor Ravi music video)
యాంకర్ రవి ఫైల్ ఫోటో (Anchor Ravi music video)


ముఖ్యంగా సినిమా పాటకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఈ పాటను ప్రొడ్యూస్ చేసారు బ్లూరాబిట్ ఎంటర్‌టైన్మెంట్. ఈ ప్రైవేట్ సాంగ్ చూసిన తర్వాత తనకు కచ్చితంగా అవకాశాలు వస్తాయని నమ్ముతున్నాడు ఈయన. ఇది మా ప్రేమకథ అంటూ రెండేళ్ల కింద హీరోగా వచ్చి ఫెయిల్యూర్ చూసాడు రవి. దానికి ముందు చాలా హంగామా చేసినా కూడా ఈ చిత్రం వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ప్రైవేట్ సాంగ్స్‌తో పాటు వెబ్ సిరీస్‌లు కూడా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు రవి. అందులో తొలి ప్రయత్నంగానే ఈ పాట చేసాడు.

సమయమే తెలియదే ఏమో ఏమో నీతో ఉంటుంటే.. సమయమే గడవదే ఏమో ఏమో నువ్వే లేకుంటే.. అంటూ సాగే సాహిత్యం కూడా బాగానే ఆకట్టుకుంటుంది. ఇందులో యాంకర్ రవితో ముద్దమందారం ఫేమ్ తనూజ నటించింది. ఈ ఇద్దరి జోడి కూడా బాగానే కుదిరింది. ఈ పాటని హేమ చంద్ర, మౌనిక రెడ్డి పాడగా.. బ్లూరాబిట్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మించింది. సత్య సాగర్ పొలం ఈ పాటని రచించారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో హీరో కార్తికేయ ఈ పాటను విడుదల చేసాడు. ప్రస్తుతం యూ ట్యూబ్‌లో బాగానే వెళ్తుంది పాట.
First published: March 1, 2020, 7:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading