• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • HERO JUNIOR NTR READY TO STARTS HIS OWN PRODUCTION HOUSE SB

రామ్‌చరణ్ రూట్‌లో జూనియర్ ఎన్టీఆర్... త్వరలో వచ్చేస్తున్నాడు

రామ్‌చరణ్ రూట్‌లో జూనియర్ ఎన్టీఆర్... త్వరలో వచ్చేస్తున్నాడు

rrr సినిమాలో ఎన్టీఆర్,రామ్ చరణ్

ప్రస్తుతం ‘RRR’ షూటింగ్‌లో యంగ్ టైగర్ కూడా బిజీగా ఉన్నారు. దీంతో ఈ బిజీ అయిపోయిన తర్వాత మరి జూనియర్ ఆ విధంగా నిర్ణయం తీసుకుంటాడో లేదో చూడాలి.

  • Share this:
    టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు సినిమాలతోనే కాదు... వేరే బిజినెస్‌లో కూడా బిజీగా మారుతున్నారు. ఇతర వ్యాపారాల్లోను కూడా తమ లక్ ఎలా ఉందో పరీక్షించుకుంటున్నారు. ఇదే బాటలోఇప్పుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా  కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది హీరోలు ఈ జాబితాలో చేరారు. మహేశ్‌బాబు, రామ్‌ చరణ్‌, నాని, విజయ్‌ దేవరకొండ సొంతంగా నిర్మాణ రంగంలో దిగి తమ సత్తాచాటుతున్నారు. మ‌హేశ్‌ సొంత సంస్థను స్థాపించి, చిత్ర నిర్మాణంలో భాగ‌స్వామ్యం తీసుకుంటున్నారు. ఇక డార్లింగ్ ప్రభాస్ చేతిలో కూడా యూవీ క్రియేష‌న్స్ ఉంది. ఇప్పుడు ఈ జాబితాలో ఎన్టీఆర్ కూడా చేర‌బోతున్నట్లు స‌మాచారం. త్వరలోనే యంగ్ టైగర్‌ కూడా సొంత నిర్మాణ సంస్థను స్థాపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

    ఇకపై త‌న సినిమాల‌ నిర్మాణంలో పాలు పంచుకునే దిశ‌గా ఎన్టీఆర్‌ అడుగులు వేస్తున్నట్లు సమాచారంజ ఓ మంచి రోజు చూసుకుని నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రకట‌న చేసే అవ‌కాశాలు కూడా కనిపిస్తున్నాయి.  ప్రస్తుతం ‘RRR’ షూటింగ్‌లో యంగ్ టైగర్ కూడా బిజీగా ఉన్నారు. దీంతో  ఈ బిజీ అయిపోయిన తర్వాత మరి జూనియర్... సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభిస్తాడో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
    First published:

    అగ్ర కథనాలు