గోపీ‌చంద్‌కు ఘోర పరాభవం.. రంగంలోకి దిగిన ప్రభాస్..

తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్, గోపీచంద్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే కదా.తాజాగా చాణక్య అనుకున్న ఫలితాన్ని సాధించలేదు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: October 19, 2019, 8:13 PM IST
గోపీ‌చంద్‌కు ఘోర పరాభవం.. రంగంలోకి దిగిన ప్రభాస్..
ప్రభాస్, గోపీచంద్ (Facebook/Photo)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్, గోపీచంద్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరు ‘వర్షం’ సినిమాలో కలిసి నటించారు. ప్రభాస్ హీరో అయితే.. గోపీచంద్ విలన్‌గా ఇరగదీసాడు. ఆ తర్వాత గోపీచంద్.. హీరోగా ఆయనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు గోపీచంద్ హీరోగా ‘జిల్’ సినిమాను తన యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మించాడు ప్రభాస్. ‘లౌఖ్యం’ తర్వాత గోపీచంద్ హిట్టు కోసం ముఖం వాచిపోయాడు.  తాజాగా గోపీచంద్ హీరోగా నటించిన ‘చాణక్య’ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు గోపీచంద్.. నిర్మాత భోగవల్లి ప్రసాద్ నిర్మాణంలో కొత్త దర్శకుడుతో ఒక సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. తాజాగా బాక్సాఫీస్ దగ్గర గోపీచంద్ నటించిన ‘చాణక్య’ ఫలితాన్నిచూసి అతనితో సినిమా చేయాలన్న ఆలోచన విరమించుకున్నాడు.

hero gopichand movie cancelled due to chanakya movie failure and prabhas helped for new movie,gopichand,prabhas,gopichand prabhas,gopichand movie cancelled,gopichand chanakya movie disaster,gopichand chanakyan movie review,prabhas helped gopichand,prabhas instagram,prabhas twitter,prabhas facebook,saaho movie,prabhas saaho amazon prime,prabhas saaho final collections,tollywood,telugu cinema,gopichand sampath nandi,గోపీచంద్,ప్రభాస్,గోపీచంద్ ప్రభాస్,గోపీచంద్‌కు ప్రభాస్ హెల్ప్,గోపీచంద్ మూవీ క్యాన్సిల్,రంగంలోకి దిగిన ప్రభాస్,ప్రభాస్ సాహో మూవీ కలెక్షన్స్,గోపీచంద్ సినిమా,గోపీచంద్
ప్రభాస్,గోపీచంద్ (Facebook/Photo)


ప్రస్తుతం గోపీ చంద్ చేతిలో సంపత్ నంది సినిమా మాత్రమే ఉంది. దాని పరిస్థితి ఏమిటి అన్నది చూడాలి. ప్రస్తుతం గోపీచంద్ కూడా ఏ సినిమా  చేయాలి. ఏది చేయకూడదనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు ప్రభాస్.. తన స్నేహితుడు గోపీచంద్ కెరీర్ నిలబెట్టడానికి ఇద్దరు ముగ్గురు బడా దర్శకులతో కథలను  రెడీ చేయిస్తున్నట్టు సమాచారం. ఈ రకంగా ప్లాపుల్లో ఉన్న గోపీచంద్‌కు ప్రభాస్ అండగా నిలబడుతూ స్నేహ ధర్నాన్ని పాటించే పనిలో పడ్డాడు.

 

First published: October 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు