తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్, గోపీచంద్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరు ‘వర్షం’ సినిమాలో కలిసి నటించారు. ప్రభాస్ హీరో అయితే.. గోపీచంద్ విలన్‌గా ఇరగదీసాడు. ఆ తర్వాత గోపీచంద్.. హీరోగా ఆయనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు గోపీచంద్ హీరోగా ‘జిల్’ సినిమాను తన యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించాడు ప్రభాస్. ‘లౌఖ్యం’ తర్వాత గోపీచంద్ హిట్టు కోసం ముఖం వాచిపోయాడు. తాజాగా గోపీచంద్ హీరోగా నటించిన ‘చాణక్య’ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు గోపీచంద్.. నిర్మాత భోగవల్లి ప్రసాద్ నిర్మాణంలో కొత్త దర్శకుడుతో ఒక సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. తాజాగా బాక్సాఫీస్ దగ్గర గోపీచంద్ నటించిన ‘చాణక్య’ ఫలితాన్నిచూసి అతనితో సినిమా చేయాలన్న ఆలోచన విరమించుకున్నాడు.
ప్రభాస్,గోపీచంద్ (Facebook/Photo)
ప్రస్తుతం గోపీ చంద్ చేతిలో సంపత్ నంది సినిమా మాత్రమే ఉంది. దాని పరిస్థితి ఏమిటి అన్నది చూడాలి. ప్రస్తుతం గోపీచంద్ కూడా ఏ సినిమా చేయాలి. ఏది చేయకూడదనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు ప్రభాస్.. తన స్నేహితుడు గోపీచంద్ కెరీర్ నిలబెట్టడానికి ఇద్దరు ముగ్గురు బడా దర్శకులతో కథలను రెడీ చేయిస్తున్నట్టు సమాచారం. ఈ రకంగా ప్లాపుల్లో ఉన్న గోపీచంద్‌కు ప్రభాస్ అండగా నిలబడుతూ స్నేహ ధర్నాన్ని పాటించే పనిలో పడ్డాడు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.