HERO GOPICHAND GOT INJURED IN SHOOTING AT RAJASTAN TA
షూటింగ్లో గాయపడ్డ హీరో గోపిచంద్.. హుటా హుటిన ఆస్పత్రికి తరలింపు..
భారత్-పాక్ సరిహద్దుల్లో గోపిచంద్
Gopichand Accident | ప్రముఖ టాలీవుడ్ నటుడు గోపిచంద్ షూటింగ్లో గాయపడ్డాడు. ప్రస్తుతం గోపిచంద్ తిరు..దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టేనర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్..జైసల్మేర్‌లోని భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో జరగుతోంది.
తాజాగా షూటింగ్లో బైక్ ఛేజింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా గోపిచంద్ బైక్ పై నుంచి కిందపడిపోయారు.
ప్రముఖ టాలీవుడ్ నటుడు గోపిచంద్ షూటింగ్లో గాయపడ్డాడు. ప్రస్తుతం గోపిచంద్ తిరు..దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టేనర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్..జైసల్మేర్‌లోని భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో జరగుతోంది.
తాజాగా షూటింగ్లో బైక్ ఛేజింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా గోపిచంద్ బైక్ పై నుంచి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో గోపిచంద్ స్వల్పంగా గాయపడినట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ రోజుతో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తి కానుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడం విషాదకరం.
వెంటనే చిత్ర యూనిట్ ఆయన్ని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం.ఈ సినిమా హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘టైగర్ జిందా హై’ మూవీకి రీమేక్ అని చెబుతున్నారు. ఈ సినిమాలో గోపిచంద్ సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తోంది.
TSR Awards Function: ఒకే వేదికపై మెరిసిన అగ్ర నటులు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.