Home /News /movies /

HERO DHANUSH BROTHER SELVA RAGHAVAN AND GEETHANJALI BLESSED WITH BABY BOY TA

హీరో ధనుశ్ ఇంట సంబరాలు.. మూడో బాబుకు తండ్రైన దర్శకుడు సెల్వ రాఘవన్.

ధనుశ్, సెల్వరాఘవన్ (File/Photo)

ధనుశ్, సెల్వరాఘవన్ (File/Photo)

హీరో ధనుశ్ మళ్లీ సంబరాలు మొదలైయ్యాయి. ధనుశ్ అన్నయ్య ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్, గీతాంజలి దంపతులు మూడోసారి పేరేంట్స్ అయ్యారు.

    హీరో ధనుశ్ మళ్లీ సంబరాలు మొదలైయ్యాయి. ధనుశ్ అన్నయ్య ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్, గీతాంజలి దంపతులు మూడోసారి పేరేంట్స్ అయ్యారు. ఇప్పటికే ఈ దంపతులకు లీలావతి, ఓంకార్ పిల్లలున్నారు. ఐతే.. ఈ సారి  సెల్వ రాఘవన్ భార్య గీతాంజలి మగబిడ్డకు జన్మనిచ్చింది. అంతేకాదు.. పుడుతూనే బిడ్డకు రిషికేష్ అనే పేరు కూడా పెట్టేసారు. ఈ విషయాన్ని సెల్వరాఘవన్ సతీమణి .. గీతాంజలి తన ఇన్‌‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులకు తెలియజేసారు. సెల్వరాఘవన్.. గీతాంజలి కంటే ముందు.. ‘7/G బృందావన్ కాలనీ లో కథానాయికగా నటించిన సోనియా అగర్వాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.



    అయితే.. 2010లో సోనియాకు  సెల్వ రాఘవన్ విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు తన దర్శకత్వ శాఖలో పనిచేసే గీతాంజలిని ప్రేమించి రెండో వివాహాం చేసుకున్నాడు. సెల్వ రాఘవన్ తెలుగులో ‘ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే’, ‘7/G బృందావన్ కాలనీ’ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈయన అయిరత్తిల్ ఒరువన్ (యుగానికి ఒక్కడు) మూవీకి సీక్వెల్‌గా  ‘అయిరత్తిల్ ఒరువన్ 2’ సినిమాను తన తమ్ముడు ధనుశ్‌తో తెరకెక్కిస్తున్నాడు.  ఈ సినిమాను తెలుగులో ‘యుగానికి ఒక్కడు 2’గా విడుదల కానుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Dhanush, Kollywood, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు