కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అజిత్ తండ్రి సుబ్రమణియన్ (Subramaniam) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం చెన్నై లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. దీంతో అజిత్ ఇంట విషాదం అలుముకుంది. అజిత్ తండ్రి మరణించారని తెలిసి ఆయన ఫ్యాన్స్, పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
అజిత్ హీరోగా నటించిన రీసెంట్ సినిమా తునివు. ఈ సినిమాతో తన కెరీర్ లో మరో భారీ హిట్ అందుకున్న ఆయన.. నెక్స్ట్ ప్రాజెక్టు కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎన్నో రోజులు నుంచి ఎదురు చూస్తున్న అజిత్ కుమార్ అభిమానులకు అజిత్ తండ్రి సుబ్రమణియన్ మరణ వార్త షాకింగ్ పరిణామంగా మారింది.
ఈ మధ్యకాలంలో అజిత్ వ్యక్తిగత విషయాలపై బోలెడన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. తన భార్య షాలినికి ఆయన బ్రేకప్ చెప్పారనే న్యూస్ జనాల్లో హాట్ హాట్ డిస్కషన్ అయింది. కొద్ది రోజుల క్రితం నుంచి అజిత్, షాలిని విడిపోతున్నారని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే షాలినితో కలిసి ఉన్న పిక్స్ షేర్ చేసి ఇలాంటి వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు అజిత్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ajith, Kollywood, Kollywood News