Home /News /movies /

HERO AADI SAI KUMAR TEES MAAR KHAN PRE RELEASE DATE ANNOUNCED SB

Aadi Sai Kumar: తీస్ మార్ ఖాన్ ప్రిలీజ్ డేట్ ఫిక్స్... ఎప్పుడంటే.. !

Photo Twitter

Photo Twitter

మాస్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా విజ‌న్‌ వస్తున్న ఈ సినిమాలో పూర్ణ‌, సునీల్‌, క‌బీర్ దుహాన్ సింగ్ కీ రోల్స్‌లో న‌టించారు. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నా సినిమా ‘తీస్ మార్ ఖాన్’.నాట‌కం ఫేం క‌ళ్యాణ్ జీ గోగ‌న డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 ఫేం పాయ‌ల్ రాజ్‌పుత్ (Payal Rajput) ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి  ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది.

    ఇప్ప‌టికే మేక‌ర్స్ విడుద‌ల చేసిన తీస్‌మార్ ఖాన్‌ సినిమా ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ చిత్రం ఆగ‌స్టు 19న రిలీజ్ కానున్న నేప‌థ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.  ఆగ‌స్టు 16న సాయంత్రం 5 గంట‌ల నుంచి హైద‌రాబాద్‌లోని  ది వెస్టిన్ హోటల్‌‌లో  ఈవెంట్ నిర్వ‌హించ‌నున్నారు. మాస్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా విజ‌న్‌ వస్తున్న ఈ సినిమాలో పూర్ణ‌, సునీల్‌, క‌బీర్ దుహాన్ సింగ్ కీ రోల్స్‌లో న‌టించారు. తీస్ మార్ ఖాన్‌కు సాయికార్తీక్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌.





    తీస్ మార్ ఖాన్ సినిమాను ఆగష్టు 19న విడుదల చేయనున్నారు. ఇప్పటికే  చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై ఆసక్తి పెంచేశాయి. అదేవిధంగా ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేసింది. . తీస్ మార్ ఖాన్ అంటూ ఈ వీడియోలో హీరో విభిన్న షేడ్స్ చూపించడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది.

    మరోవైపు హీరో ఆది మ‌రోవైపు ఫ‌ణి కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ఫెలో సినిమా చేస్తున్నాడు. దిగంగ‌నా సూర్య‌వంశి, మిర్ణా ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 16న విడుద‌ల కానుంది. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌ల‌తో ఎంట‌ర్‌టైన్ మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నాడు ఆది సాయికుమార్.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Aadi Sai Kumar, Payal Rajput, Tollywood

    తదుపరి వార్తలు