‘ప్రేమకావాలి’ అంటూ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడు ఆది. ఆ తర్వాత విడుదలైన ‘లవ్లీ’ కూడా మంచి విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ‘సుకుమారుడు’, ‘ప్యార్ మే పడిపోయానే’, ‘గాలిపటం’, ‘రఫ్’... ఇలా ఓ డజన్ సినిమాలు చేసినా ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం సఫలం కాలేకపోతున్నాడు ఆది. అయినా ప్రయత్నం మానని ఆది... వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది కూడా మూడు సినిమాలు ఆది చేతిలో ఉన్నాయి. ‘సాయికిరణ్ అడివి’ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆపరేషన్ గోల్డ్‌ఫిష్’తో పాటు ‘బుర్రకథ’, ‘జోడి’ అనే సినిమాలు చేస్తున్నాడు ఆది. తాజాగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘బుర్రకథ’ సినిమా టీజర్ విడుదలైంది. ‘చిన్నదాన నీకోసం’ ఫేమ్ మిస్త్రీ చక్రవర్తి హీరోయిన్గా నటించిన ‘బుర్రకథ’లో నైరా షా అనే అమ్మాయి సెకండ్ ఫీమేల్ లీడ్ చేస్తోంది.
‘నాన్న గారూ... నేనొక బ్రహృత్తరమైన నిర్ణయం తీసుకున్నాను... బ్రహ్మచారి పట్టాతో సన్యాసం తీసుకుంటున్నా...’ అంటూ ఆది చెప్పే డైలాగ్‌తో సినిమా టీజర్ మొదలవుతుంది. ఒకే మనిషిలో రెండు మెదడులు ఉండడం, ఒకే వ్యక్తి ఒకేసారి రెండు రకాలుగా ప్రవర్తించడం వంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందినట్టు టీజర్ చూస్తే స్పష్టంగా అర్థమైంది. అభిరామ్ ఆది పేరు. అయితే అందులో అభి ఆలోచనలు తుంటరిగా, రామ్ సంప్రదాయాలకు విలువ నిచ్చే వ్యక్తిగా కనిపిస్తాడు. ఆది తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కనిపిస్తుండడం, 30 ఇయర్స్ పృథ్వీ మంచి రోల్లో కనిపించబోతుండడం ‘బుర్రకథ’పై అంచనాలు పెంచేస్తున్నాయి. అయితే ఈ సినిమా వృత్తాంతంతో రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా రూపొంది, బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమాతో పోలిస్తే ఈ సినిమా చాలా బెటర్‌గా డీల్ చేసినట్టు తెలుస్తున్నా... అపజయాలతో ఉన్న ఆదికి ‘బుర్రకథ’ ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే.
‘బుర్రకథ’ సినిమా టీజర్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.