Kiara advani: కియారా అద్వానీ ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు..

కియారా అద్వానీ (Instagram/Photo)

  • Share this:
    కియారా అద్వానీ..తెలుగులో మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' , రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' సినిమాల్లో నటించి టాలీవుడ్‌లో సత్తా చూపెట్టింది. ఆ తర్వాత షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘కబీర్ సింగ్’ సక్సెస్‌తో బాలీవుడ్‌లో జెండా పాతింది. అక్కడ వరుస కమిట్‌మెంట్స్ ఇస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది. ప్రస్తుతం కియారా అద్వానీ అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో 'లక్ష్మీబాంబ్‌' అనే ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తోంది. తాజాగా కియారా అద్వానీ షోల్ మీడియాలో ఆసక్తికమర విషయాలను వెల్లడించింది. త్వరలో వాళ్లింట్లో పెళ్లి బాజా మోగనున్న సంగతి వెల్లడించింది. తన సిస్టర్‌కు పెళ్లి కుదిరిన విషయాన్ని కియారా ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. తన సిస్టర్‌కు అభినందనలు తెలియజేసింది. నా సోదరితో పాటు ఆమెకు కాబోయే వాడు ఇద్దరు ఆనందంగా ఉండాలని కోరకుంటున్నానంది. ప్రెజెంట్ కియారా అద్వానీ..  అక్షయ్ కుమార్, కరీనాకపూర్‌ల ‘గుడ్‌న్యూస్’ సినిమాలో దల్జీత్ దోసాంజ్‌కు సరసన నటించింది. ఈ వారమే ఈ సినిమా విడుదల కానుంది. వాటితో పాటు ‘ఇందూ కీ జవానీ’ సినిమాలో యాక్ట్ చేస్తోంది.


    Published by:Kiran Kumar Thanjavur
    First published: