షాకింగ్: ‘పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్’ సిరీస్ నుంచి జానీ డెప్ అవుట్...

కెప్టెన్ జాక్ స్పారో పాత్రలో ఫిదా చేసిన హాలీవుడ్ సూపర్‌స్టార్ జానీ డెప్... ఆరో సిరీస్ నుంచి జానీడెప్‌ను తప్పించినట్టు స్పష్టం చేసిన డిస్నీ స్టూడియోస్ సంస్థ!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: October 26, 2018, 5:05 PM IST
షాకింగ్: ‘పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్’ సిరీస్ నుంచి జానీ డెప్ అవుట్...
‘పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్’ మూవీలో జానీ డెప్ స్టిల్!
  • Share this:
హాలీవుడ్ మూవీ ‘పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్’ సృష్టించిన వండర్స్ అన్నీ ఇన్నీ కావు. వింత వింత వేషాల్లో సముద్రపు దొంగలు చేసే సాహసాలు, అద్భుతమైన గ్రాఫిక్స్, మంచి సోషియో ఫాంటసీ కథ కలగలిపి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాయి ‘పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్’ సిరీస్‌లో వచ్చిన చిత్రాలు. ముఖ్యంగా కెప్టెన్ జాక్ స్పారో పాత్రలో హాలీవుడ్ సూపర్‌స్టార్ జానీ డెప్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే ఈ సిరీస్‌లో వస్తున్న తర్వాతి చిత్రంలో నుంచి జానీ డెప్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని డిస్నీ స్టూడియోస్ సంస్థ ఖరారు కూడా చేసేసింది.

ఈ వార్త జానీ డెప్ అభిమానులనూ, ముఖ్యంగా ‘పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్’ చిత్రం కోసం వేచిచూస్తున్న ప్రేక్షకులు షాక్‌కి గురయ్యారు. ఇప్పటిదాకా ‘పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్’ సిరీస్‌లో ఐదు చిత్రాలు వచ్చాయి. వీటన్నింటిలో జానీడెప్ పాత్రే కీలకం. 15 ఏళ్లుగా ఈ హాలీవుడ్ హీరో కరేబియన్ సిరీస్ చిత్రాలకు ప్రధాన ఆకర్షణగా ఉన్నాడు కూడా. అయితే ఆరో సిరీస్ నుంచి జానీ డెప్ తప్పుకున్నట్టు ఒరిజినల్ స్క్రిప్ట్ రైటర్ స్టువర్ట్ బీట్టి తెలియచేశాడు. హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న స్టార్‌గా వెలుగొందిన జానీ డెప్...నాలుగేళ్లుగా వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతున్నాడు. జానీ డెప్ దగ్గర మేనేజర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి, అతన్ని మోసం చేశాడు. ఈ సంఘటన తర్వాత ఆర్థికంగా, చట్టపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న జానీ డెప్... షూటింగ్‌కి సహకరించడం లేదంటూ, షూటింగ్ స్పాట్‌లో ఓ వ్యక్తిపై చెయ్యి చేసుకున్నాడంటూ వార్తలు వచ్చాయి.

అంతేకాకుండా జానీడెప్ నటించిన తాజా చిత్రం ‘డెడ్ మ్యాన్ టెల్ నో టేల్స్’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. దాంతో జానీడెప్‌ను ‘పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్’ సిరీస్ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది డిస్నీ స్టూడియోస్. అయితే కెప్టెన్ జాక్ స్పారో పాత్రలో జానీ డెప్ సృష్టించిన అంచాలను అందుకోవడం మరే నటుడి వల్లా కాదని అభిమానులు భావిస్తున్నారు.
Published by: Ramu Chinthakindhi
First published: October 26, 2018, 5:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading