Rallapalli: డాక్టర్ కావాల్సిన సీనియర్ నటుడు రాళ్ళపల్లి కూతురు ఎలా మరణించారు.. శవం కోసం ప్రధాని సాయం..!

సీనియర్ నటుడు రాళ్ళపల్లి (Rallapalli)

Rallapalli: తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్ప కమెడియన్లు ఉన్నారు. అందులో రాళ్ళపల్లి నరసింహారావు(Rallapalli Narasimha Rao) కూడా ఒకరు. తెరపై కడుపుబ్బా నవ్వించిన ఈయన జీవితంలో ఎంతో కన్నీరు దాగుంది. ముఖ్యంగా ఈయన కూతురు మరణం ఓ దారుణం.

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్ప కమెడియన్లు ఉన్నారు. అందులో రాళ్ళపల్లి నరసింహారావు కూడా ఒకరు. దాదాపు 800 సినిమాలకు పైగానే నటించాడు ఈయన. 40 ఏళ్ళకు పైగానే సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసారు. 1945లో జన్మించిన ఈయన.. 2019లో అనారోగ్యంతో చనిపోయారు. మరణించే వరకు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు. చనిపోయే సమయానికి కూడా బుల్లితెరపై బాబాయో హోటల్ ప్రోగ్రామ్ చేస్తున్నారు రాళ్ళపల్లి. సినిమాలు, నాటకాలు, సీరియల్స్ అంటూ అన్నింట్లోనూ ఈయన ప్రమేయం ఉండేది. పైకి ఎంతో నవ్వుతూ కనిపించే ఈయన గుండెల్లో ఎంతో బాధను దాచిపెట్టుకున్నారు. ఈయనకు ఇద్దరు కూతుళ్ళు. అందులో ఒకరు చనిపోయారు. పెద్దమ్మాయి మరణం పాపం ఈయన్ని చనిపోయే వరకు కూడా వెంటాడుతూనే ఉండేది. కళ్ళ ముందే ఎదిగొచ్చిన కూతురును కాటికి సాగనంపడం కంటే దారుణమైన పరిస్థితి మరోటి లేదని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు రాళ్ళపల్లి.

డాక్టర్ కావాల్సిన అమ్మాయి కళ్ల ముందే కాటికి వెళ్తుంటే కన్నీరు ఆపుకోలేక.. జీవశ్చవంలా మిగిలిపోయారు ఈయన. రాళ్ళపల్లి పెద్దమ్మాయి పేరు మాధురి. ఈమె మెడిసిన్ చదువుకోడానికి రష్యా వెళ్లాలనుకుంది. దానికోసం ఢిల్లీకి బయల్దేరింది. అయితే మధ్యలోనే వైరల్ ఫీవర్ రావడంతో.. పరిస్థితి విషమించి చనిపోయింది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే.. ఏ ఫ్లయిట్‌లో అయితే ఆమెను రష్యాకు పంపించాలనుకున్నాడో.. అదే ఫ్లయిట్‌లో తిరిగి ఆమె మృతదేహం రావడం.
Rallapalli Narasimha Rao,Rallapalli Narasimha Rao movies,Rallapalli Narasimha Rao comedy,Rallapalli Narasimha Rao daughter madhuri death,Rallapalli Narasimha Rao daughter dies fever,telugu cinema,Rallapalli Narasimha Rao pv narasimha rao,సీనియర్ నటుడు రాళ్ళపల్లి,సీనియర్ నటుడు రాళ్ళపల్లి కూతురు మరణం వెనక కథ
సీనియర్ నటుడు రాళ్ళపల్లి (Rallapalli)

అప్పట్లో ఈమె భౌతిక కాయాన్ని ఢిల్లీ నుంచి చెన్నై రప్పించడానికి నాటి ప్రధాని పివి నరసింహారావు గారు కూడా సాయం చేసారని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. కూతురు మరణం చూసిన తర్వాత రాళ్ళపల్లి తట్టుకోలేకపోయాడు. ‘బాధ అనేది నీ లోపల దాచుకో.. ఆనందాన్ని పదిమందికి పంచు’ అనేది ఇతడి తత్వం. అందుకే ఇతడి వ్యక్తిగత బాధలను ఎవరికీ చెప్పుకోవడం ఇష్టం ఉండదు. చనిపోయే వరకు కూడా తన బాధను మరొకరితో పంచుకోకుండానే ఉన్నారు. అలాగే వెళ్లిపోయారు కూడా.
Published by:Praveen Kumar Vadla
First published: