Home /News /movies /

HERE THE REAL FACTS BEHIND WHY BULLET BHASKAR AND APPARAO FIGHT IN JABARDASTH COMEDY SHOW PK

జబర్దస్త్‌లో అప్పారావును భాస్కర్ ఎందుకు కొట్టాడంటే..

జబర్దస్త్ కామెడీ షోలో గొడవ (bullet bhaskar apparao)

జబర్దస్త్ కామెడీ షోలో గొడవ (bullet bhaskar apparao)

Jabardasth Comedy Show: ఓ స్కిట్‌లో భాగంగా బుల్లెట్ భాస్కర్, అప్పారావు మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ క్రమంలోనే భాస్కర్‌ను బండ బూతులు తిట్టాడు అప్పారావు. విషయం ఏంటంటే..

కొన్నిసార్లు కామెడీ కూడా తెలియకుండానే సీరియస్ అవుతుంటుంది. ఇఫ్పుడు కూడా ఇదే జరిగింది. ఎప్పుడూ నవ్వులు పంచే జబర్దస్త్ కామెడీ షో ఇప్పుడు సీరియస్ అయింది. అందులో ఓ స్కిట్‌లో భాగంగా బుల్లెట్ భాస్కర్, అప్పారావు మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ క్రమంలోనే భాస్కర్‌ను బండ బూతులు తిట్టాడు అప్పారావు. విషయం ఏంటంటే.. స్కిట్‌లో భాగంగా అప్పారావును భాస్కర్ కొట్టాలి.. ఆ స్కిట్‌లో అంతా కొట్టుకుంటూనే ఉంటారు. అలాగే మిగిలిన వాళ్లతో పాటు అప్పారావును కూడా కొట్టాడు భాస్కర్. దాంతో ఆయన ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు.

జబర్దస్త్ కామెడీ షోలో గొడవ (bullet bhaskar apparao)
జబర్దస్త్ కామెడీ షోలో గొడవ (bullet bhaskar apparao)


దీనికి సంబంధించిన ప్రోమో వారం రోజులుగా వైరల్ అవుతుంది. అసలెందుకు కొట్టుకున్నారు అనేది ఇప్పుడు ఎపిసోడ్‌లో తెలిసిపోయింది. స్కిట్ అయితే ఇలా కొడతారా అంటూ భాస్కర్‌ను తిట్టేసాడు అప్పారావు. షర్ట్ విప్పేసి తనకు పడిన వాతలను చూపించాడు. ఇలా ఎవరైనా కొడతారా.. స్కిట్ పేరు చెప్పి గొడ్డును బాదినట్లు బాదావ్ అంటూ భాస్కర్‌పై మండి పడ్డాడు. నేను కూడా టీం లీడర్ అనే సంగతి మరిచిపోయావా.. నీ య.. అంటూ బండ బూతులు తిట్టాడు. అయితే ఈ ఇద్దరూ నిజంగానే కొట్టుకున్నారేమో అని కంగారు పడొద్దు.. ఇదంతా స్కిట్‌లో భాగమే. బుల్లెట్ భాస్కర్ ఇదంతా కలకంటాడు.. ఆ కల్లోనే భాస్కర్, అప్పారావు మధ్య గొడవ జరుగుతుంది.

జబర్దస్త్ కామెడీ షోలో గొడవ (bullet bhaskar apparao)
జబర్దస్త్ కామెడీ షోలో గొడవ (bullet bhaskar apparao)


జబర్దస్త్ కామెడీ షోలో ఇలాంటి జిమ్మిక్కులు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అప్పారావు ఇలాగే చేసాడు. అప్పట్లో షకలక శంకర్ టీంలో ఉన్నపుడు కూడా ఇలాగే కొడితే.. సీరియస్ అయ్యాడు. కానీ ఆ తర్వాత అది స్కిట్‌లో భాగమే అని చెప్పారు. ఇప్పుడు కూడా ఇదే చేసారు. మరోసారి స్టేజీపై అందర్నీ ఫూల్స్‌ను చేసే ప్రయత్నమే చేసారు. కానీ సీరియస్ అయినా కూడా జబర్దస్త్‌లో అలాంటి గొడవలు జరగవని నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. మొత్తానికి వారం రోజుల సస్పెన్స్ కలలో తేల్చేసాడు బుల్లెట్ భాస్కర్.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth apparao, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు