మహేష్ బాబు మోకాలి సర్జరీ వెనక దాగిన అసలు నిజాలివే..

Mahesh Babu: మహేష్ బాబు ప్రస్తుతం న్యూయార్క్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. కుటుంబంతో పాటే అక్కడున్నాడు. నమ్రతతో పాటు పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. మరో వారం రోజుల్లో ఈయన ఇండియాకు కూడా రానున్నాడు. మోకాలి సర్జరీపై క్లారిటీ వచ్చేసింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 29, 2020, 10:41 PM IST
మహేష్ బాబు మోకాలి సర్జరీ వెనక దాగిన అసలు నిజాలివే..
మహేష్ బాబు (Mahesh Babu)
  • Share this:
మహేష్ బాబుకు సర్జరీ జరిగిందని.. న్యూయార్క్‌లో మోకాలికి ఆయన శస్త్ర చికిత్స చేయించుకున్నారని కొన్ని రోజులుగా మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. పైగా మరో మూడు నెలల వరకు అక్కడే ఉంటాడనే వార్తలు కూడా వచ్చాయి. ఆగడు సినిమా సమయంలో తగిలిన గాయం మళ్లీ తిరగబెట్టడంతో ఇప్పుడు సర్జరీ చేయించుకున్నాడనే ప్రచారం జరుగుతుంది. అయితే అందులో నిజమెంత అనేది మాత్రం ఇప్పటికీ బయటికి రాలేదు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబుకు ఎలాంటి సర్జరీ కాలేదు. ఆయన మోకాలికి కూడా ఎలాంటి శస్త్ర చికిత్స జరగలేదు.

మహేష్ బాబు (Mahesh Babu)
మహేష్ బాబు (Mahesh Babu)


ప్రస్తుతం ఆయన న్యూయార్క్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. కుటుంబంతో పాటే అక్కడున్నాడు. నమ్రతతో పాటు పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. మరో వారం రోజుల్లో ఈయన ఇండియాకు కూడా రానున్నాడు. చికాగో, న్యూ యార్క్ ట్రిప్స్ తర్వాత ఆయన అక్కడ్నుంచి దుబాయ్ వెళ్లనున్నాడని తెలుస్తుంది. అక్కడ రెండు మూడు రోజులు ఉన్న తర్వాత ఇండియాకు రానున్నాడు సూపర్ స్టార్. అయితే వచ్చిన తర్వాత ఆయన సినిమా షూటింగ్స్ మాత్రం చేయడు.

మహేష్ బాబు (Mahesh Babu)
మహేష్ బాబు (Mahesh Babu)
ఇంకొన్ని రోజులు పూర్తి రెస్ట్ మోడ్‌లోనే ఉండబోతున్నాడు. ఇప్పటికే ఈయన వంశీ పైడిపల్లి కథకు ఓకే చెప్పాడు. కొన్ని రోజులుగా రెస్ట్ లేకుండా సరిలేరు నీకెవ్వరు సినిమా చేసి అలిసిపోయాడు సూపర్ స్టార్. అందుకే మే తర్వాత కానీ కొత్త సినిమా మొదలు పెట్టడం లేదు మహేష్. అప్పటి వరకు హాలీడేస్ ఎంజాయ్ చేయనున్నాడు ఈయన. మొత్తానికి మహేష్ బాబు మోకాలి సర్జరీ అంటూ వచ్చిన వార్తలు మాత్రం పూర్తిగా అబద్ధమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
First published: January 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు