హోమ్ /వార్తలు /సినిమా /

RC15: తెరపైకి కొత్త టైటిల్‌.. వద్దే వద్దంటున్న మెగా ఫ్యాన్స్! కారణమిదే..

RC15: తెరపైకి కొత్త టైటిల్‌.. వద్దే వద్దంటున్న మెగా ఫ్యాన్స్! కారణమిదే..

Photo Twitter

Photo Twitter

RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో రామ్ చరణ్ కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ విషయమై జనాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. డైరెక్టర్ శంకర్ ఫైనల్ చేసిన ఓ టైటిల్ మెగా అభిమానులకు అంతగా రుచించడం లేదట.

రీసెంట్‌గా దర్శక ధీరుడు రాజమౌళితో (SS Rajamouli) కలిసి RRR రూపంలో భారీ సక్సెస్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. ప్రస్తుతం మరో బిగ్ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారు. బడా దర్శకులు శంకర్ (Shankar) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తొలిసారి త్రిపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో తండ్రి.. ఇద్దరు కుమారులుగా చెర్రీ కనిపించనున్నారని వింటున్నాం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ (RC15 title) విషయమై ఓ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇది మెగా అభిమానులకు అంతగా రుచించడం లేదని తెలుస్తోంది.

గత కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మరో షెడ్యూల్ షూటింగ్ కోసం యూనిట్ రెడీ అవుతుండగా.. ఈ సినిమా కోసం డైరెక్టర్ శంకర్ ఓ టైటిల్ ఫైనల్ చేశారని తెలుస్తోంది. ముందుగా ఈ చిత్రానికి సర్కారోడు అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో శంకర్ తన డిసీజన్ మార్చుకొని అధికారి అనే పేరుకు మొగ్గు చూపుతున్నట్లు ఇన్‌సైడ్ టాక్. కథ ప్రకారం ఈ టైటిల్ బాగా యాప్ట్ అవుతుందని ఆయన భావిస్తున్నారట.

ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్న ఈ సినిమాలో ఎలక్షన్ కమీషనర్‌గా రామ్ చరణ్ కనిపించనున్నారట. దీంతో పాటు రెండు డిఫరెంట్ మాస్ షేడ్స్ చూడబోతున్నామట. ఈ క్రమంలోనే అధికారి అనే టైటిల్ ఫైనల్ అయ్యారని టాక్. అయితే ఈ టైటిల్ బయటకు లీక్ కావడంతో మెగా ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ఇది చాలా ఓల్డ్‌గా అనిపిస్తోందని, ఈ జెనరేషన్‌లో ఇలాంటి టైటిల్ ఎవ్వరికీ పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చని, కాబట్టి ఈ టైటిల్ వద్దే వద్దని అంటున్నారు. దీంతో RC15 టైటిల్ మరోసారి జనాల్లో డిస్కషన్ పాయింట్ అయింది.

దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రాబోతున్న 50వ సినిమా కావడంతో ఈ మూవీపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ఇందులో చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జ‌యరామ్‌, అంజ‌లి, సునీల్, శ్రీకాంత్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కాన్సెప్ట్‌ పోస్టర్ కోసమే దాదాపు 2 కోట్ల వరకు ఖర్చు చేశారని విన్నాం. దీన్ని బట్టి సినిమా ఓ రేంజ్‌లో రూపొందుతోందో మీరే అర్థం చేసుకోవచ్చు.

First published:

Tags: Dil raju, Ram Charan, RC 15, Shankar

ఉత్తమ కథలు