జబర్దస్త్ ఈజ్ బ్యాక్.. లాక్‌డౌన్ తర్వాత ఫస్ట్ ఎపిసోడ్‌లో మార్పులివే..

Jabardasth new episode: జబర్దస్త్ కామెడీ షో మళ్లీ మొదలైపోయింది.. ఫస్ట్ ఎపిసోడ్‌లోనే కావాల్సినంత నవ్వులను తీసుకొచ్చింది. చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా అందుకే అంతా మంచి కసి మీద కనిపించారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 25, 2020, 10:39 PM IST
జబర్దస్త్ ఈజ్ బ్యాక్.. లాక్‌డౌన్ తర్వాత ఫస్ట్ ఎపిసోడ్‌లో మార్పులివే..
జబర్దస్త్ కొత్త ఎపిసోడ్ (jabardasth new episode)
  • Share this:
జబర్దస్త్ కామెడీ షో మళ్లీ మొదలైపోయింది.. ఫస్ట్ ఎపిసోడ్‌లోనే కావాల్సినంత నవ్వులను తీసుకొచ్చింది. చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా అందుకే అంతా మంచి కసి మీద కనిపించారు. ఒక్కొక్కరు ఒక్కోలా పంచులతో రెచ్చిపోయారు. రాఘవ ఎప్పట్లాగే తనదైన శైలిలో నవ్విస్తే.. హైపర్ ఆది తన మార్క్ సెటైర్లతో దూసుకుపోయాడు. బాలయ్యను కూడా వదలకుండా సై అనేసాడు ఆది. ఇక అదిరే అభి తన కండలతో పాటు పంచులతో నవ్వించాడు. తాగుబోతు రమేష్ న్యూ ఎంట్రీ ఇచ్చాడు. ఈయన కూడా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చాడు.

ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో (extra jabardasth)
ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో (extra jabardasth)


లాక్‌డౌన్ తర్వాత వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్‌లో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. జడ్జిలుగా రోజా, మనో కంటిన్యూ అయ్యారు. అనసూయ భరద్వాజ్ మాత్రం లాక్‌డౌన్ కారణంగా కాస్త బొద్దుగా మారిపోయింది. ఇదిలా ఉంటే బాగా పర్ఫార్మ్ చేయని టీమ్స్‌ను నిర్ధాక్షణ్యంగా తొలగించారు మల్లెమాల యూనిట్. అసలే ఇప్పుడు రేటింగ్స్ విషయంలో చాలా వెనకబడిపోయింది జబర్దస్త్. పాత ఎపిసోడ్స్ ప్రసారం చేయడంతో రేటింగ్స్ విషయంలో రేసులో వెనకబడింది ఈ షో. ఇప్పుడు మూడు నెలల తర్వాత ఫ్రెష్ ఎపిసోడ్స్ వస్తున్నాయి.

జబర్దస్త్ కామెడీ షో (Jabardasth Comedy Show)
జబర్దస్త్ కామెడీ షో (Jabardasth Comedy Show)


దాంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సరిగ్గా చేయని పాత వాళ్లను తీసేసి కొత్త వాళ్లకు ఛాన్స్ ఇచ్చింది మల్లెమాల. జబర్దస్త్ కామెడీ షో ఆఫ్టర్ లాక్‌డౌన్ ఎపిసోడ్‌లో మరోసారి హైపర్ ఆది పడిపడి నవ్వించాడు. ఆయనతో పాటే తాగుబోతు రమేష్, అభి, రాఘవ లాంటి వాళ్లు కూడా తమ వంతుగా మంచి నవ్వులే అందించారు. ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో కూడా కొన్ని మార్పులు చేసారు. అక్కడ కూడా జడ్జిలు వాళ్లే.. యాంకర్ రష్మి గౌతమే.. కానీ ఫసక్ శశి లాంటి టీమ్స్ ఎగిరిపోయి.. షకలక శంకర్ లాంటి వాళ్లు ఎంట్రీ ఇచ్చారు.
First published: June 25, 2020, 10:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading