సీనియర్ నటి జయంతి ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్‌డేట్..

Senior actress Jayanthi: ఎన్నో వందల సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి జయంతి. తెలుగుతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లోనూ నటించింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 12, 2020, 8:21 PM IST
సీనియర్ నటి జయంతి ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్‌డేట్..
సీనియర్ నటి జయంతికి అస్వస్థత (Twitter/Photo)
  • Share this:
ఎన్నో వందల సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి జయంతి. తెలుగుతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లోనూ నటించింది. ఇక్కడ ఒకప్పటి అగ్ర కథానాయకులతో నటించి మెప్పించింది ఈమె. ప్రస్తుతం ఈమె అనారోగ్యం పాలైంది. రెండేళ్ల కింద ఈమె కాస్త అనారోగ్యం పాలైతే చనిపోయిందంటూ ప్రచారం చేసారు. దాంతో అప్పట్లో ఆమె చాలా సీరియస్ అయింది కూడా. అయితే ఈ మధ్యే మళ్లీ ఈమెకు అనారోగ్యం తిరగబెట్టింది. దాంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

సీనియర్ నటి జయంతి (actress Jayanthi)
సీనియర్ నటి జయంతి (actress Jayanthi)


ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. దాంతో జయంతి ఆరోగ్యం ఎలా ఉందో అని అభిమానులతో పాటు శ్రేయోభిలాషులు కూడా వేచి చూస్తున్నారు. అలాంటి వాళ్లకు ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిపై జయంతిని ట్రీట్ చేస్తున్న డాక్టర్ సతీష్ సమాచారం అందించాడు. ఆమె చికిత్సకు స్పందిస్తున్నారని.. ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిపాడు. ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉంచామని ఆయన క్లారిటీ ఇచ్చాడు.

సీనియర్ నటి జయంతి (actress Jayanthi)
సీనియర్ నటి జయంతి (actress Jayanthi)


ఆమెను మరికొన్ని రోజుల్లో డిశ్చార్జ్ చేయనున్నట్లు చెప్పాడు డాక్టర్ సతీష్. మరోవైపు తన తల్లి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని.. భయపడాల్సిందేమీ లేదని జయంతి కుమారుడు కృష్ణ కుమార్ కూడా మీడియాకు తెలిపాడు. 2018లో కూడా ఆమె ఇలాంటి అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరి కొన్ని రోజుల తర్వాత కోలుకున్నారు. లాక్‌డౌన్ అమలు చేసిన మొదట్లో ఆమె హంపిలో తన కుమారుడితో కలిసి ఉంటుంది. ఆ తర్వాత బెంగళూరుకు వచ్చింది. మొత్తానికి ప్రస్తుతం జయంతి ఆరోగ్యం కుదుటపడుతుందని తెలిపారు వైద్యులు.
Published by: Praveen Kumar Vadla
First published: July 12, 2020, 8:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading