హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రమణ్యం చివరి పాట ఏ హీరోకు పాడాడో తెలుసా..?

SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రమణ్యం చివరి పాట ఏ హీరోకు పాడాడో తెలుసా..?

SP Balasubrahmanyam: గాన గంధర్వుడు, మధుర గాయకుడు, సంగీత స్వరరాగ చక్రవర్తి ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం జీర్ణించుకోలేని విషయం. 50 ఏళ్లుగా తన గాత్రంతో అందర్నీ మాయ చేసిన ఈ గానం ఇప్పుడు మూగబోయింది.

గాన గంధర్వుడు, మధుర గాయకుడు, సంగీత స్వరరాగ చక్రవర్తి ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం జీర్ణించుకోలేని విషయం. 50 ఏళ్లుగా తన గాత్రంతో అందర్నీ మాయ చేసిన ఈ గానం ఇప్పుడు మూగబోయింది. సెప్టెంబర్ 25 మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఆయన చనిపోయారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు.. సంగీత ప్రియులు.. సినీ ప్రముఖులు.. రాజకీయ ప్రముఖులు అంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన ఇన్నేళ్ల కెరీర్‌లో 40 వేలకు పైగా పటాటలు పాడాడు. ఆయన పాడిన తొలి పాట ఏంటంటే వెంటనే చెప్పొచ్చు. 1966లో శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాలో పద్మనాభం కోసం పాడాడు బాలు. మరి ఆయన పాడిన చివరి పాట ఏంటి అనేది మాత్రం చాలా మందికి ఐడియా లేదు. ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చింది. గత రెండు నెలలుగా ఆయన హాస్పిటల్‌లోనే ఉన్నారు. కానీ దానికి ముందు ఆరోగ్యంగా ఉన్నారు బాలు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)
ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

అప్పుడే తన చివరి పాటను రికార్డు చేసాడు ఈయన. ఆయన చివరగా పాడింది తమిళ పాటే.. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమా కోసం ఇంట్రడక్షన్ సాంగ్ పాడాడు బాలు. మొన్న విడుదలైన దర్బార్‌లో దుమ్ము దూళి అంటూ దుమ్ము లేపాడు బాలు. ఇప్పుడు కూడా శివ తెరకెక్కిస్తున్న అన్నాత్తే కోసం ఇంట్రో సాంగ్ పాడాడు బాలసుబ్రమణ్యం. అలా కన్ను మూయడానికి ముందు బాలు పాడిన చివరి పాట రజనీ ‘అన్నాత్తే’ సినిమాలోదే. రజినీ ఇంట్రో సాంగ్స్ ఎన్నో పాడాడు బాలు. ఇప్పుడు చివరి పాట కూడా అదే కావడం విశేషం. ఈ విషయాన్ని ఆ స్వయంగా అన్నాత్తే చిత్ర సంగీత దర్శకుడు డి.ఇమ్మాన్ వెల్లడించాడు. రజనీకాంత్ సైతం బాలుకు నివాళులు అర్పిస్తూ బాలు తన కోసం చివరగా పాడిన పాటను గుర్తు చేసుకున్నారు. మరి ఆ పాట ఎలా ఉండబోతుందో అని బాలు అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Rajinikanth, SP Balasubrahmanyam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు