హోమ్ /వార్తలు /సినిమా /

చెవికి పోగు.. మెడపై టాటూ.. సర్కారు వారి పాట సీక్రేట్స్..

చెవికి పోగు.. మెడపై టాటూ.. సర్కారు వారి పాట సీక్రేట్స్..

అమెరికాలో సింగిల్ షెడ్యూల్‌తో మెజారిటీ షూట్ పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు పరశురామ్. అమెరికా షెడ్యూల్ తర్వాత ఇండియాలో కేవలం 30 శాతం మాత్రమే మిగిలి ఉంటుందని.. దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సమ్మర్ కానుకగా సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే పేపర్ వర్క్ పూర్తి అయిపోయింది.. వీసాల కోసం వేచి చూస్తున్నట్లు నిర్మాతల్లో ఒకరు తెలిపారు.

Sarkaru Vaari Pata: మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట పోస్టర్ సంచలనాలు రేపుతుంది. సోషల్ మీడియాలో విడుదలైన కాసేపటికే ఏకంగా 10 లక్షల మంది దీన్ని షేర్ చేసారు. ఇది సరికొత్త రికార్డు..

మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట పోస్టర్ సంచలనాలు రేపుతుంది. సోషల్ మీడియాలో విడుదలైన కాసేపటికే ఏకంగా 10 లక్షల మంది దీన్ని షేర్ చేసారు. ఇది సరికొత్త రికార్డు.. సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ మరోసారి నిరూపించుకున్నాడు సూపర్ స్టార్. ఇదిలా ఉంటే పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఫస్ట్ లుక్ విడుదలతోనే అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. పరశురామ్ సినిమా అంటే ఏదో లవ్ స్టోరీనో లేదంటే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తీస్తాడని అనుకున్నారు. కానీ ఈయన మాత్రం పూర్తిగా కొత్త కథతో వస్తున్నాడు. ఇప్పటి వరకు సూపర్ స్టార్ చేయని కథను ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు.

మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్ (sarkaru vaari pata movie)
మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్ (sarkaru vaari pata movie)

ఇదిలా ఉంటే ఇప్పుడు విడుదలైన ఫస్ట్ లుక్‌లో కొన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి.. అలాగే అంచనాలు కూడా పెంచేస్తున్నాయి. మహేష్ బాబు చెవిపోగు అందులో ఒకటి. ఇప్పటి వరకు ఏ సినిమాలో లేనంత కొత్తగా ఈ చిత్రం కోసం మారిపోతున్నాడు సూపర్ స్టార్. ముఖ్యంగా హెయిర్ స్టైల్ కూడా బాగానే మారిపోయింది. ఇక చెవిపోగు అదిరిపోయింది. అన్నింటికి మించి మెడపై రూపాయి కాయిన్ టాటూ కూడా ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్ర కథ ప్రకారం ఆర్థిక నేరాలు చేసే పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నాడని తెలుస్తుంది.

మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్ (sarkaru vaari pata movie)
మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్ (sarkaru vaari pata movie)

డబ్బులు అంటే ప్రాణమిచ్చే పాత్ర ఇది అని.. అందుకే రూపాయి నాణేన్ని తన మెడపై టాటూ వేయించుకుంటాడని ప్రచారం జరుగుతుంది. బ్యాంకింగ్ మోసాల చుట్టూ ఈ కథను అల్లుకున్నాడు పరశురామ్. అందుకే సర్కారు వారి పాట అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసాడు. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. షూటింగ్‌కు అనుమతి వచ్చిన వెంటనే బ్రేకుల్లేకుండా సర్కారు వారి పాట పూర్తి కానుంది. అన్నీ కుదిర్తే వచ్చే ఏడాది సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు పరశురామ్. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్‌తో కలిసి జిఎంబీ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు మహేష్ బాబు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Mahesh babu, ParasuRam, Sarkaru vaari pata, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు