• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • HERE THE INTERESTING STORY AND HILARIOUS BEACKDROP BEHIND MAHESH BABU OKKADU MOVIE DHARMAVARAPU PHONE NUMBER PK

Mahesh Babu Okkadu: ‘ఒక్కడు’ సినిమాలో ధర్మవరపు చెప్పే 9848*****9 నెంబర్ ఎవరిదో తెలుసా..?

Mahesh Babu Okkadu: ‘ఒక్కడు’ సినిమాలో ధర్మవరపు చెప్పే 9848*****9 నెంబర్ ఎవరిదో తెలుసా..?

ఒక్కడు సినిమాలో ధర్మవరపు కామెడీ సీన్ (Okkadu Comedy Scene)

Mahesh Babu: మహేష్ బాబు కెరీర్‌లో తొలి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ఒక్కడు(Okkau). మురారి(Murari) సినిమాతో అప్పటికే గుర్తింపు తెచ్చుకున్న ఈయనకు ఒక్కడు సినిమాతో స్టార్ డమ్ వచ్చింది. ఈ చిత్రం అప్పట్లో సంచలన రికార్డులు తిరగరాసింది.

  • Share this:
మహేష్ బాబు కెరీర్‌లో తొలి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ఒక్కడు. మురారి సినిమాతో అప్పటికే గుర్తింపు తెచ్చుకున్న ఈయనకు ఒక్కడు సినిమాతో స్టార్ డమ్ వచ్చింది. ఈ చిత్రం అప్పట్లో సంచలన రికార్డులు తిరగరాసింది. ఏకంగా 100 సెంటర్లకు పైగా వంద రోజులు ఆడింది. గుణశేఖర్ కూడా ఒక్కడు సినిమాతో స్టార్ డైరెక్ట్రర్ అయిపోయాడు. మాస్‌కు మహేష్ బాబును మరింత చేరువ చేసిన సినిమా ఇది. భూమిక చావ్లా, మహేష్ మధ్య రొమాంటిక్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. ప్రకాశ్ రాజ్ యాక్షన్.. ఛార్మినార్ సెట్.. కామెడీ.. కబడ్డీ ట్రాక్ అన్నీ బాగా వర్కవుట్ అయ్యాయి. ఇక ఈ చిత్రంలో మరో విశేషం కూడా ఉంది. ఇందులో పాస్ పోస్ట్ కోసం మహేష్ బాబు వచ్చినపుడు ధర్మవరపు సుబ్రమణ్యం ఓ నెంబర్ పదే పదే చెప్తుంటాడు. తన లవర్‌కు ఫోన్ చేసి మాట్లాడాలని చూస్తుంటాడు. ఆ ఫోన్ కామెడీ సీక్వెన్స్ అదిరిపోయేలా వర్కవుట్ అయింది.

పాస్ పోర్ట్ చేతికి ఇవ్వడం కుదరదన్న సమయంలో.. ఆయన కొత్తగా కొన్న ఫోన్‌కి తన లవర్ మొదటి కాల్ చేస్తుందని ఆశగా ఎదురు చూస్తుంటాడు. అదే సమయంలో హీరో తన స్నేహితులు కలిసి అతన్ని బాగా ఏడిపిస్తారు.

ఒక్కడు సినిమాలో ధర్మవరపు కామెడీ సీన్ (Okkadu movie)
ఒక్కడు సినిమాలో ధర్మవరపు కామెడీ సీన్ (Okkadu movie)


అప్పుడు రొమాంటిక్‌గా తన ఫోన్ నెంబర్ 9848*****9 ఇది అని చెప్తాడు ధర్మవరపు. ఆ ఫోన్ నెంబర్ వెనక చాలా పెద్ద కథ ఉంది. షూటింగ్ చేసేటప్పుడు ఎవరి నెంబర్ పెట్టాలో తెలియక తికమకపడుతున్న సమయంలో ఆ చిత్ర నిర్మాత ఎంఎస్ రాజు నెంబర్ ఇచ్చేసారు.

ఒక్కడు సినిమాలో ధర్మవరపు కామెడీ సీన్ (Okkadu movie)
ఒక్కడు సినిమాలో ధర్మవరపు కామెడీ సీన్ (Okkadu movie)


ఒక్కడు విడుదలైన తర్వాత రోజుకు వేలాది కాల్స్ వచ్చేవని రాజు ఈ మధ్యే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దాంతో చేసేదేం లేక ఆ నెంబర్ తీసేసి మరో నెంబర్ తీసుకున్నాడు ఎమ్ఎస్ రాజు. ఏదేమైనా కూడా ఆ నెంబర్ కహానీ మాత్రం అదిరిపోయేలా ఉంది కదా.
Published by:Praveen Kumar Vadla
First published: