HERE THE INTERESTING FACTS ABOUT SENSATIONAL BIGG BOSS 5 TELUGU SHOW AND WILL NAGARJUNA CONTINUE AS HOST PK
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు ఎప్పట్నుంచి.. నాగార్జున కంటిన్యూ అవుతున్నాడా..?
బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu)
Bigg Boss 5 Telugu: చూస్తుండగానే బిగ్ బాస్ 4 తెలుగు(Bigg Boss 4 Telugu) అయిపోయి కూడా నాలుగు నెలలు పూర్తైపోయింది. దాంతో అంతా నెక్ట్స్ సీజన్ గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడే 4 నెలలు అయిపోవడంతో సీజన్ 5 ఎప్పట్నుంచి అనే చర్చ మొదలైపోయింది.
చూస్తుండగానే బిగ్ బాస్ 4 తెలుగు అయిపోయి కూడా నాలుగు నెలలు పూర్తైపోయింది. 106 రోజుల పాటు ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్టైన్ చేసిన బిగ్ బాస్ 4 విజేతగా నిలిచాడు అభిజీత్. గత సీజన్లో అభిజీత్, అఖిల్ చివరి వరకు పోరాడినా కూడా అభి ట్రోఫీ అందుకుని ఇంటికి మహానాయకుడు అయిపోయాడు. కొన్ని విషయాల్లో అభిజీత్‌ను బీట్ చేయలేకపోయాడు అఖిల్. బయటికి వచ్చిన తర్వాత తన ఇమేజ్ కాపాడుకుంటూ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నాడు అఖిల్. కానీ విన్నర్ అయిన అభి మాత్రం ఇప్పటికీ సైలెంట్‌గానే ఉన్నాడు. మరోవైపు సోహెల్ కూడా సినిమా హీరో అయిపోయాడు. ఆయన రెండు సినిమాలు చేస్తున్నాడిప్పుడు. ఇదిలా ఉంటే సీజన్ 4 పూర్తయింది. దాంతో అంతా నెక్ట్స్ సీజన్ గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడే 4 నెలలు అయిపోవడంతో సీజన్ 5 ఎప్పట్నుంచి అనే చర్చ మొదలైపోయింది. గతేడాది బిగ్ బాస్ సీజన్ జరగాల్సిన దానికంటే 5 నెలలు ఆలస్యంగా మొదలైంది. కోవిడ్ కారణంగా జూన్‌లోనే రావాల్సిన సీజన్ సెప్టెంబర్‌లో వచ్చింది. దాంతో ఇప్పుడు తర్వాతి సీజన్ కోసం ఏడాది వరకు వేచి చూడాల్సిన అవసరం వచ్చేలా కనిపిస్తుంది.
ఐపిఎల్ అయితే ఆర్నెళ్లు తిరక్కుండానే వచ్చేసింది కానీ బిగ్ బాస్ మాత్రం అలా కాదు. దీనికోసం మరో ఆర్నెళ్లు వేచి చూడాల్సిందే. ఈ సారి కూడా బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్‌లోనే ఉండబోతుందని తెలుస్తుంది. వచ్చే సీజన్ కూడా కచ్చితంగా నాగార్జున హోస్ట్ చేస్తాడు ఆ కన్ఫ్యూజన్ అయితే ఎవరికీ లేదు.
బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu)
ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాగార్జున హోస్టుగా సెట్ అయిపోయినట్లే. దాంతో ఆయన్ని కాదని మరో హోస్ట్ కోసం స్టార్ మా వెతకడం కూడా అత్యాశే అవుతుందేమో..? దాంతో కొత్త సీజన్లో వచ్చే గెస్టులు.. ఎప్పుడు మొదలు కానుంది.. వీటి గురించే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం మాత్రం 2021 సెప్టెంబర్ రెండో వారంలో బిగ్ బాస్ 5 తెలుగు మొదలు కానుంది.
నాగార్జున (Bigg Boss 4 Telugu)
దీనికోసం ఇప్పట్నుంచే గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది. వచ్చే సీజన్ అంతా తెలియని మొహాలు కాకుండా తెలిసిన వాళ్లనే తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా కాంట్రవర్సీలు ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వివాదంలోనే వినోదం ఎక్కువగా ఉండేలా డోస్ పెంచబోతున్నారు నిర్వాహకులు. అందుకే నెక్ట్స్ సీజన్‌పై అంచనాలు మొదలైపోయాయి.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.