HERE THE INTERESTING FACTS ABOUT DIRECTOR ACTOR POSANI KRISHNA MURALI SON PRAJWAL PK
Posani Krishna Murali son: పోసాని కృష్ణమురళి కొడుకు గురించి ఈ నిజాలు ఎంతమందికి తెలుసు..?
పోసాని కృష్ణమురళి (posani krishna murali)
Posani Krishna Murali son: పోసాని కృష్ణమురళి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సంచలన సినిమాలు.. నవ్వించే పాత్రలు.. గుర్తుండిపోయే కథలు.. గత పాతికేళ్లుగా తెలుగు ఇండస్ట్రీతో విడదీయరాని అనుబంధం పెనవేసుకున్నాడు పోసాని.
పోసాని కృష్ణమురళి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సంచలన సినిమాలు.. నవ్వించే పాత్రలు.. గుర్తుండిపోయే కథలు.. గత పాతికేళ్లుగా తెలుగు ఇండస్ట్రీతో విడదీయరాని అనుబంధం పెనవేసుకున్నాడు పోసాని. ఈయన పేరు చెప్తే కొందరికి ఆపరేషన్ ధుర్యోధన లాంటి ఎమోషనల్ సినిమా గుర్తుకొస్తుంది.. మరికొందరికి ఈయన కలం నుంచి జాలువారిన పవిత్ర బంధం, సీతయ్య లాంటి సినిమాలు బుర్రలోకి వస్తుంటాయి.. ఇంకొందరికి ఏం మాట్లాడుతున్నావ్ రా నరాలు కట్ అయిపోతున్నాయ్ అంటూ నాయక్ సినిమాలో చేసిన కామెడీ గుర్తొస్తుంది. ఏం చేసినా కూడా 100 శాతం చేయడం పోసానికి అలవాటు. అయితే అంత ఫేమస్ అయినా కూడా ఈయన వ్యక్తిగత జీవితం గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే తన ప్రైవేట్ లైఫ్ అంత సీక్రేట్‌గా ఉంచుతాడు ఈయన. సినిమా ముచ్చట్లు తప్పిస్తే ఈయన పర్సనల్ ఏంటనేది ఎవరికీ ఐడియా కూడా లేదు. దర్శకుడిగా, రైటర్‌గా కంటే ప్రస్తుతం నటుడిగా దూసుకుపోతున్నాడు పోసాని. 8 ఏళ్ల కింద రామ్ చరణ్ హీరోగా నటించిన నాయక్ సినిమాతో ఈయన దశ మారిపోయింది. అప్పటి వరకు అడపా దడపా నటిస్తూ వచ్చిన పోసానిని ఫుల్ టైమ్ ఆర్టిస్టుగా మార్చేసింది నాయక్. అప్పట్నుంచి తనలోని రైటర్, డైరెక్టర్‌ను నటుడు డామినేట్ చేస్తున్నాడని పోసాని సైతం ఒప్పుకున్నాడు. ఈయన దగ్గర అసిస్టెంట్స్‌గా పని చేసిన త్రివిక్రమ్, కొరటాల లాంటి వాళ్లు పోసాని కృష్ణమురళి దగ్గరే సహాయకులుగా పని చేసారు. వాళ్లిప్పుడు స్టార్ డైరెక్టర్స్ అయిపోయారు.
పోసాని కృష్ణమురళి (Poasni Krishna Murali)
ఇదిలా ఉంటే పోసానికి ఓ కొడుకు ఉన్నాడనే సంగతి చాలా మందికి తెలియదు. అతడి పేరు ప్రజ్వల్. తండ్రి మాదిరే ఈయన కూడా దర్శకుడిగా మారే ప్రయత్నంలో ఉన్నాడు. దానికోసం తనవంతు కృషి చేస్తున్నాడు. ఇప్పటికే తన కొడుకుకు లాస్ ఏంజిల్స్‌లో దర్శకత్వ శాఖకు సంబంధించిన కోచింగ్ తీసుకుని వచ్చాడు ప్రజ్వల్. తన కొడుకును అక్కడ్నుంచి వచ్చిన తర్వాత తన మేనల్లుడు, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేర్చాడని తెలుస్తుంది.
పోసాని కృష్ణమురళి (Poasni Krishna Murali)
కొరటాల శివ తెరకెక్కించిన భరత్ అనే నేను సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు కూడా. తనకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అంటున్నాడు పోసాని తనయుడు ప్రజ్వల్. మంత్రిగారు మాటిచ్చారు అనే సినిమాను ఈయన తెరకెక్కించాడు కూడా. మొత్తానికి తండ్రి మాదిరే తను కూడా దర్శకుడిగా సత్తా చూపిస్తానంటున్నాడు పోసాని తనయుడు.