• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • HERE THE INTERESTING DETAILS ABOUT PAWAN KALYAN VAKEEL SAAB MOVIE SUPERWOMAN ACTRESS LIRISHA REDDY PK

Vakeel Saab Superwoman: ‘వకీల్ సాబ్’ సూపర్ ఉమెన్ గురించి ఈ నిజాలు మీకు తెలుసా..?

Vakeel Saab Superwoman: ‘వకీల్ సాబ్’ సూపర్ ఉమెన్ గురించి ఈ నిజాలు మీకు తెలుసా..?

వకీల్ సాబ్ సూపర్ ఉమెన్ సీన్ (Vakeel Saab movie)

Vakeel Saab Superwoman: వకీల్ సాబ్(Vakeel Saab) సినిమా చూసిన వాళ్లకు సూపర్ ఉమెన్ సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ ఉమెన్ అంటూ సెటైరికల్‌గా పవన్ పేల్చిన డైలాగులు అదిరిపోయాయి. ఈ నటికి కూడా సూపర్ ఇమేజ్ వచ్చేసింది. ఆమె పేరు లిరిష.

  • Share this:
వకీల్ సాబ్ సినిమా చూసిన వాళ్లకు సూపర్ ఉమెన్ సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో ఆ సీన్ మామూలుగా పేలలేదు. సూపర్ ఉమెన్ అంటూ అదో మాదిరి సెటైరికల్‌గా పవన్ పేల్చిన డైలాగులు అదిరిపోయాయి. థియేటర్స్‌లో ఈ సీన్ వచ్చినపుడు మామూలు ఈలలు కాదు.. పవన్ కామెడీ టైమింగ్ చూసి ఫ్యాన్స్ కడుపులు చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. పింక్‌లో కానీ.. నేర్కొండ పార్వైలో కానీ ఈ కామెడీ సీన్స్ లేవు. అక్కడ కథ అంతా సీరియస్‌గా సాగుతుంది. కానీ వకీల్ సాబ్ సినిమాలో మాత్రం పవన్ అండ్ టీం కలిసి చాలా వరకు మార్పులు చేసారు. అవి వర్కవుట్ అయ్యాయి కూడా. వకీల్ సాబ్ సినిమా ఇంత పెద్ద విజయం సాధించిందంటే కారణం పింక్ సినిమాను ఉన్నదున్నట్లు కాకుండా మార్పులు చేయడమే. పవన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా చేసిన మార్పులు సినిమాకు మంచి వసూళ్లు తీసుకొచ్చాయి. వకీల్ సాబ్ సినిమాలో ఎన్ని సన్నివేశాలున్నా కూడా ఒక్కటి మాత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అదే సూపర్ ఉమెన్ సీన్. ఈ నటికి కూడా సూపర్ ఇమేజ్ వచ్చేసింది. ఆమె పేరు లిరిష.

సినిమాలతో పాటు సీరియల్స్, వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది లిరిష. అయితే తగిన గుర్తింపు మాత్రం రాలేదు. ముఖ్యంగా సీరియల్స్‌లో విలన్ పాత్రలు బాగానే చేసింది ఈమె. అలాంటి సమయంలో ఈమెకు వకీల్ సాబ్ సినిమాలో అవకాశం వచ్చింది.

సూపర్ ఉమెన్ అంటూ పవన్ ఇచ్చిన ఎలివేషన్‌తో లిరిష కెరీర్‌కు మంచి స్పీడ్ వచ్చింది. అల్వాల్ నుంచి మొయినాబాద్‌కు సిర్ఫ్ 15 మినిట్ మే వచ్చిండ్రామ్మా మీరు.. సూపర్ ఉమెన్ అంటూ కోర్టులో ప్రశ్నిస్తాడు పవన్. దానికి ఆమె ఏదైతే అది అయిందని జెట్ స్పీడ్‌లో వచ్చిన సర్ అని చెప్తుంది. దానికి మళ్లీ ఓహ్.. అంటూ పవన్ గట్టిగా అరుస్తాడు. నిజానికి స్క్రిప్టులో ఈ సీన్ అంతా లేదు. అసలు అక్కడ సూపర్ ఉమెన్ అనే డైలాగ్ లేదు. కానీ పవన్ ఇంకా ఏదో కావాలని.. ఆ సీన్‌లో డైలాగ్ యాడ్ చేసారని చెప్పింది లిరిష.

పవన్ సొంతంగా మార్చేసి అక్కడ ఆ పదం పెట్టడం వల్లే సీన్ అంతగా పేలిందని చెప్పుకొచ్చింది ఈమె. వకీల్ సాబ్ సినిమాతో తనకు చాలా గుర్తింపు వచ్చిందని.. ఎక్కడికి వెళ్లినా కూడా తనను సూపర్ ఉమెన్ అని పిలుస్తున్నారని చెప్పింది ఈమె. అయితే ఈమె పవన్ కంటే ముందు చిరంజీవితో నటించింది లిరిష. 15 ఏళ్ల కింద వచ్చిన స్టాలిన్ సినిమాలో సునీల్‌ను పెళ్లి చేసుకునే అమ్మాయి పాత్రలో నటించింది ఈమె. ఆ తర్వాత చాలా సినిమాలు, సీరియల్స్ చేసినా కూడా రాని గుర్తింపు ఒక్క సూపర్ ఉమెన్ పాత్రతో వచ్చేసింది.
Published by:Praveen Kumar Vadla
First published: