హోమ్ /వార్తలు /సినిమా /

Movie ticket rates in AP & TS: ఏపీ, తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Movie ticket rates in AP & TS: ఏపీ, తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Movie ticket rates in AP & TS: ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం సినిమా టికెట్స్‌పై చర్చ బాగా జరుగుతుంది. ఒక చోట భారీ రేట్లు ఉండగా.. మరోచోట మాత్రం ఛాయ్ కంటే తక్కువ రేట్లకు సినిమాలు చూసే అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి జగన్. మరి ఏపీ, తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు (Movie ticket rates in AP & TS) ఎలా ఉన్నాయో చూద్దాం..

ఇంకా చదవండి ...

ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం సినిమా టికెట్స్‌పై చర్చ బాగా జరుగుతుంది. ఒక చోట భారీ రేట్లు ఉండగా.. మరోచోట మాత్రం ఛాయ్ కంటే తక్కువ రేట్లకు సినిమాలు చూసే అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి జగన్. ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు, గ్రామ పంచాయతీలకు ప్రాంతాల వారీగా సినిమా టికెట్ల ధరను ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే తెలంగాణలో కూడా టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు పెంచుకోమ్మని.. మరోవైపు తగ్గించమని ఆదేశాలు జారీ చేసారు. ఏపీలో కొత్త ధరల ప్రకారం టికెట్ ధర రూ.5 నుంచి రూ.250 వరకు ఉంది. మరోవైపు తెలంగాణలో 50 నుంచి మొదలై 300 వరకు ధరలున్నాయి. మరి ఈ టికెట్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

ఏపీలో టికెట్ రేట్లు..

మున్సిపల్ కార్పొరేషన్లు.. మున్సిపాలిటీలు.. నగర పంచాయతీలు.. గ్రామ పంచాయతీలు..
1. మల్టీప్లెక్స్ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.250, డీలక్స్ రూ.150, ఎకానమీ రూ.75 ధరలుగా నిర్ణయించారు. 1. మల్టీప్లెక్స్ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60 ధరలుగా నిర్ణయించారు. 1. మల్టీప్లెక్స్ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40 ధరలుగా నిర్ణయించారు. 1. మల్టీప్లెక్స్ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30 ధరలుగా నిర్ణయించారు.
2. ఏసీ/ఎయిర్ కూల్ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40 ధరలుగా నిర్ణయించారు. 2. ఏసీ/ఎయిర్ కూల్ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30 ధరలుగా నిర్ణయించారు. 2. ఏసీ/ఎయిర్ కూల్ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15 ధరలుగా నిర్ణయించారు. 2. ఏసీ/ఎయిర్ కూల్ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10 ధరలుగా నిర్ణయించారు.
3. నాన్ ఏసీ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20 ధరలుగా నిర్ణయించారు. 3. నాన్ ఏసీ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15 ధరలుగా నిర్ణయించారు. 3. నాన్ ఏసీ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10 ధరలుగా నిర్ణయించారు. 3. నాన్ ఏసీ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5 ధరలుగా నిర్ణయించారు.


తెలంగాణలో టికెట్ ధరలు..

అదే సమయంలో తెలంగాణలో మాత్రం సినిమా టికెట్‌ ధరలు చాలా వేరుగా ఉన్నాయి. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పైగా ఇప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అంటూ అనుమతులు కూడా జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. నిర్మాతల విజ్ఞప్తి మేరకు రేట్ల పెంపుపై ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించిన తెలంగాణ సర్కారు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

1. AC థియేటర్లలో కనిష్ఠం రూ.50 + GST.. గరిష్ఠం రూ.150+GST

2. Non AC థియేటర్లలో కనిష్ఠం రూ.30+GST.. గరిష్ఠం రూ.70+GST

3. మల్టీప్లెక్స్‌ల్లో కనిష్ఠం రూ.100+GST.. గరిష్ఠం రూ.250+GST

4. సింగిల్‌ థియేటర్లలో రిక్లైనర్‌ సీట్స్‌ ఉంటే గరిష్ఠంగా రూ.200+GST.. మల్టీప్లెక్స్‌లో రిక్లైనర్స్‌కు గరిష్ఠంగా రూ.300+GST

5. స్పెషల్‌ ఐమాక్స్‌ లార్జ్‌ స్క్రీన్ (75 MM మించిన) సింగిల్‌ థియేటర్లలో.. రూ.250+GST

6. నిర్వహణ చార్జీల కింద AC థియేటర్లలో టికెట్‌ పై రూ.5, నాన్‌-ఏసీలో టికెట్‌పై రూ.3 వసూలు చేసుకునేందుకు అనుమతించిన ప్రభుత్వం

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Ap cm ys jagan mohan reddy, CM KCR, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు