హోమ్ /వార్తలు /సినిమా /

Krack movie child artist: ‘క్రాక్’ సినిమాలో రవితేజ కొడుకుగా నటించిన బుడ్డోడి బ్యాగ్రౌండ్ తెలుసా..?

Krack movie child artist: ‘క్రాక్’ సినిమాలో రవితేజ కొడుకుగా నటించిన బుడ్డోడి బ్యాగ్రౌండ్ తెలుసా..?

 క్రాక్:

క్రాక్:

Krack movie child artist: 2021కి అదిరిపోయే ఆరంభం అందించాడు మాస్ రాజా రవితేజ. నాలుగేళ్లుగా హిట్ లేని ఈయనకు ఇప్పుడు క్రాక్ సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు. ఈ చిత్రం రెండు వారాల్లో 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.

2021కి అదిరిపోయే ఆరంభం అందించాడు మాస్ రాజా రవితేజ. నాలుగేళ్లుగా హిట్ లేని ఈయనకు ఇప్పుడు క్రాక్ సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు. ఈ చిత్రం రెండు వారాల్లో 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇంకా మంచి వసూళ్లే సాధిస్తుంది కూడా. ఇదిలా ఉంటే క్రాక్ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు కూడా బయటికి వస్తున్నాయి. ఈ చిత్ర కథ కోసం గోపీచంద్ మలినేని ఒంగోలులో జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనలు తీసుకున్నాడు. పైగా తాను పుట్టి పెరిగిన ఊరు కావడంతో అక్కడ కఠారి కృష్ణ కారెక్టర్ కూడా బాగానే తీర్చిదిద్దాడు గోపీచంద్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. ఈ సినిమాలో రవితేజ కొడుకుగా నటించిన బుడ్డోడి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు బాగానే వస్తున్నాయి. ఎందుకంటే ఈ కుర్రాడి బ్యాగ్రౌండ్ కూడా బాగానే ఉ:ది. ఎవర్రా ఈ కుర్రాడు.. భలే ఉన్నాడు.. పైగా మాస్ రాజాపై నాన్ స్టాప్ పంచులు వేస్తున్నాడంటూ ఆ బుడ్డోడి గురించి తెగ మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. ఈ పిల్లాడికి మంచి ఫ్యూచర్ ఉంది. కచ్చితంగా ఈ కుర్రాడు మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు అంటూ అంతా పొగిడేస్తున్నారు. అయితే ఈ కుర్రాడెవరో మీకు తెలుసా..? ఈయన బ్యాగ్రౌండ్ గురించి మీకు ఐడియా ఉందా..? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడొచ్చింది.

krck movie,krack movie collections,ravi teja twitter,ravi teja son in krack movie,krack movie ravi teja son,gopichand malineni son satwik in krack movie,telugu cinema,క్రాక్,క్రాక్ సినిమా గోపీచంద్ మలినేని,క్రాక్ సినిమాలో గోపీచంద్ మలినేని కొడుకు సాత్విక్
రవితేజ క్రాక్ పోస్టర్ (Ravi Teja Krack poster)

క్రాక్‌ సినిమాలో రవితేజపై అంతగా సెటైర్లు వేసిన ఆ కుర్రాడెవరో తెలుసా.. దర్శకుడు గోపీచంద్ మలినేని కొడుకు సాత్విక్. కథ గురించి తెలుసు.. అందులో కుర్రాడి పాత్ర ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసు కాబట్టి తన సినిమా కోసం బయటి బాల నటుడిని కాకుండా కొడుకునే లాంచ్ చేసాడు. సాధారణంగా కొడుకు పాత్ర అంటే సైలెంట్ గా ఉంటుంది కానీ రవితేజ కొడుకు మాత్రం క్రాక్ లో మరోలా ఉన్నాడు. సూపర్ సెటైరికల్ గా ఉన్నాడు ఈ చిచ్చుబుడ్డి. క్రాక్ సినిమా చేసిన తర్వాత మాస్టర్ సాత్విక్‌కు మరిన్ని అవకాశాలు కూడా వస్తున్నాయి. అయితే చదువు కారణంగా సినిమాలు వెంటనే ఒప్పుకోవడం కాస్త కష్టంగా మారుతుంది. ఏదేమైనా కూడా ఒక్క సినిమాతోనే సాత్విక్‌కు మంచి పేరు వస్తుంది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Ravi Teja, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు