Home /News /movies /

HERE IT IS PRATI ROJU PANDAAGE TWITTER REVIEW BS

ప్రతి రోజూ పండగే ట్విట్టర్ రివ్యూ..

ప్రతి రోజూ పండగే

ప్రతి రోజూ పండగే

Prati Roju Pandaage Twitter Review : ప్రతిరోజూ పండగే సినిమా ఎలా ఉంది? సాయి తేజ్ పండగ తీసుకొచ్చాడా? లేదా? అంటే.. అమెరికా ప్రేక్షకులు చెబుతున్నదిదీ.

    ఒకే రోజు మూడు సినిమాలు రిలీజ్.. మెగా హీరో సాయి తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే, నటసింహం బాలకృష్ణ నటించిన రూలర్, తమిళ హీరో కార్తీ నటించిన దొంగ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే.. ప్రతిరోజూ పండగే సినిమా ఎలా ఉంది? సాయి తేజ్ పండగ తీసుకొచ్చాడా? లేదా? అంటే.. అమెరికా ప్రేక్షకులు చెబుతున్నదిదీ. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కాన్సెప్ట్‌తో సంక్రాంతికి ముందు వచ్చిన సినిమా ఇది. సాయి తేజ్, రాశీ ఖన్నా, రావు రమేశ్, సత్యరాజ్ తదితరులు నటించిన ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు దర్శకుడు మారుతి. సినిమా రివ్యూ విషయానికి వస్తే సినిమాకు సాయి తేజ్ నటన, రావు రమేశ్ పర్ఫార్మెన్స్, రాశీ ఖన్నా గ్లామర్ కొంత వరకు కలిసి వచ్చాయని, ఎమోషన్ సీన్లు బలవంతంగా ప్రేక్షకులపై రుద్దేలా ఉన్నాయని, స్క్రీన్ ప్లే నెమ్మదిగా ఉందని చెబుతున్నారు. ఫస్టాఫ్ బాగున్నా, సెకండాఫ్ అంతగా మెప్పించలేకపోయిందని అంటున్నారు ట్విట్టరీలు.



    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Maruthi, PratiRoju Pandaage, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు