Dance Shows: మారిపోతున్న‌ డ్యాన్స్ రియాలిటీ షోల తీరు.. డ్యాన్స్ త‌ప్ప అన్నీ ఉంటున్నాయా

డ్యాన్స్ షోలు

Dance Relaity Shows: బుల్లితెర‌పై డ్యాన్స్ రియాలిటీ షోల‌కు మంచి క్రేజ్ ఉంటుంది. అందులో కంటెస్టెంట్‌లుగా పోటీ చేసిన ప‌లువురు సినిమాల్లోకి కూడా వ‌చ్చారు. ఈ లిస్ట్‌లో టాలీవుడ్‌లో సునీల్, సాయి ప‌ల్ల‌వి, కృష్ణ చైత‌న్య ఇలా చాలా మందే ఉన్నారు

  • Share this:
    Dance Relaity Shows: బుల్లితెర‌పై డ్యాన్స్ రియాలిటీ షోల‌కు మంచి క్రేజ్ ఉంటుంది. అందులో కంటెస్టెంట్‌లుగా పోటీ చేసిన ప‌లువురు సినిమాల్లోకి కూడా వ‌చ్చారు. ఈ లిస్ట్‌లో టాలీవుడ్‌లో సునీల్, సాయి ప‌ల్ల‌వి, కృష్ణ చైత‌న్య ఇలా చాలా మందే ఉన్నారు. అయితే రాను రాను ఈ రియాలిటీ షోలు మారిపోతున్నాయి. ఒక‌ప్పుడు డ్యాన్స్ అంటే శ‌రీరాన్ని క‌దప‌డం మాత్ర‌మే కాదు ముఖంలో భావాల‌ను కూడా చూపించేవారు. కాన్సెప్ట్‌ని తీసుకొని డ్యాన్స్‌లు చేసినా అందులోని భావం చూసేవాడికి అర్థ‌మ‌య్యేలా చేసేవారు. అంతేకాదు పాట‌ల్లోని సాహిత్యానికి అర్థ‌వంతంగా స్టెప్పులు ఉండేవి. అయితే ఇప్పుడు అదంతా మారిపోయిందని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ప‌లు ఛానెళ్ల‌లో డ్యాన్స్ షోలు ప్ర‌సారం అవుతున్నాయి. ఇప్పుడు ఈటీవీలో వ‌చ్చే ఢీ, స్టార్ మాలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ ప్ల‌స్ షోకు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. అయితే ఈ రియాలిటీ షోల‌ను చూస్తున్న కొంద‌రు.. ఇవి డ్యాన్స్ షోలా అని ప్ర‌శ్నిస్తున్నారు.

    ఒక‌ప్పుడు డ్యాన్స్ షోల‌లో కంటెస్టెంట్‌ల డ్యాన్స్, జ‌డ్జిల జ‌డ్జిమెంట్ మాత్ర‌మే ఉంటుండ‌గా.. ఇప్పుడు మ‌ధ్య మ‌ధ్య‌లో ఫ‌న్నీ టాస్క్‌ల‌ను పెడుతున్నారు. కామెడీ పేరుతో మెంటార్‌ల‌పై జోకులు వేస్తున్నారు. అవి ఒక్కొక్క‌సారి మితిమీరిపోతున్నాయి కూడా. ఇక ముఖ్యంగా డ్యాన్స్ విష‌యంకి వ‌స్తే.. ఇప్పుడు డ్యాన్స‌ర్లు చేసే డ్యాన్స్ స‌ర్క‌స్‌లా ఉంటుందని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పాట‌లోని లిరిక్స్‌కి సంబంధం లేకుండా గాల్లో ఎగిరే స్టెప్పులు వేస్తూ పాట‌ల‌ను ఖూనీ చేస్తున్నార‌ని కొంత‌మంది కామెంట్లు చేస్తున్నారు. మంచి భావం ఉన్న పాట‌ల‌కు సైతం త‌మ స్టెప్పుల‌తో వాటిని ఖూనీ చేస్తున్నారని అంటున్నారు. కొన్ని రొమాంటిక్ పాటలకు మితిమీరిపోయి రొమాన్స్ చేస్తున్నారన్న అభిప్రాయం కూడా వెలువడుతోంది. అంతేకాదు పిల్లలతో చేపించే డ్యాన్స్ లు కూడా కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయని వీక్షకులు అంటున్నారు.

    ఇక జడ్జిల విష‌యంలోనూ చాలా విమ‌ర్శ‌లే వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు డ్యాన్స్ మాస్ట‌ర్లు షోల‌కు జ‌డ్జిలుగా ఉండ‌గా.. ఇప్పుడు వారి స్థానంలో న‌టీన‌టులు కూడా వ‌స్తున్నారు. అందులో కొంద‌రికి డ్యాన్స్ పరిఙ్ఞానం కూడా లేద‌ని కొంత‌మంది కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి డ్యాన్స్ రియాలిటీ షోలల్లో డ్యాన్స్ త‌ప్ప అన్నీ ఉన్నాయంటూ చాలా మంది అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మేర‌కు యూట్యూబ్‌లో షో వీడియోల కింద కామెంట్లు పెడుతున్నారు.
    Published by:Manjula S
    First published: