Prabhas: రాజ‌మౌళి, ప్ర‌శాంత్‌నీల్‌ల‌తో ప్ర‌భాస్ కామన్ పాయింట్‌...ఏంటో చెప్పుకోండి?

Here is an interesting link between Prabhas, SS Rajamouli and Prashanth Neel full details here

Rajamouli - Prashanth Neel: దక్షిణాది సినిమాల రేంజ్ పెంచిన స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి, ప్రశాంత్ నీల్‌లకు రెబెల్ స్టార్ ప్రభాస్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అదేంటో తెలుసా..

  • Share this:
    రాజ‌మౌళి... ప్ర‌శాంత్ నీల్, వీరిద్ద‌రి గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు సినీ జ‌నాల‌కు. ఇద్దరూ ప్యాన్ ఇండియా డైరెక్ట‌ర్స్‌. ద‌క్షిణాది సినిమాలను ప్యాన్ ఇండియా రేంజ్‌లో కాదు, ప్యాన్ వ‌ర‌ల్డ్ రేంజ్‌కు తీసుకెళ్లారు. ఇప్పుడు వీరిద్ద‌రి సినిమాల కోసం వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఉన్న సినీ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి సిద్ధం అవుతుండ‌గా, ప్ర‌శాంత్ నీల్ ‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 2’తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. రాజ‌మౌళి ఇంకా ఆర్ఆర్ఆర్‌ను తెర‌కెక్కిస్తుండ‌గా, ప్ర‌శాంత్ నీల్ కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 2 పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజి బిజీగా ఉన్నాడు.

    ఈ ఇద్ద‌రు స్టార్ సౌత్ డైరెక్ట‌ర్స్‌కు రెబెల్ స్టార్ ప్ర‌భాస్‌తో ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది. ఇంత‌కీ ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌కు ప్ర‌భాస్ ఉన్న అంత స్పెష‌ల్ రిలేష‌న్ ఏంటి? అనే వివ‌రాల్లోకి వెళితే, ప్ర‌భాస్‌తో రాజ‌మౌళి తెరకెక్కించిన భారీ బ‌డ్జెట్ మూవీ ఛ‌త్ర‌ప‌తి. ఈ సినిమా ప్ర‌భాస్‌ను మాస్‌కు చాలా ద‌గ్గ‌ర చేసింది. ఈ సినిమా డైరెక్ట‌ర్‌గా రాజ‌మౌళికి నాలుగో సినిమా. అలాగే ప్ర‌శాంత్ నీల్ ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో చేస్తున్న స లార్ సినిమా విష‌యానికి వ‌స్తే.. స‌లార్ కూడా ప్ర‌శాంత్ నీల్‌కు నాలుగో సినిమా. ఇలా ఇద్ద‌రు స్టార్ డైరెక్ట‌ర్స్ త‌మ నాలుగో సినిమాల‌ను ప్ర‌భాస్‌తోనే చేయ‌డం యాదృచ్చిక‌మే అయినా అభిమానుల‌కు మాత్రం హ్యాపీనే.

    ప్ర‌భాస్‌ను ప్యాన్ ఇండియా స్టార్‌గా మార్చిన ఘ‌న‌త రాజ‌మౌళికే ద‌క్కింది. ఈ ద‌ర్శ‌క‌ధీరుడు తెరకెక్కించిన బాహుబ‌లి సాధించిన విజయం గురించి స్పెష‌ల్‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు సినిమా రేంజ్‌ను పెంచిన చిత్ర‌మిది. అలాగే ఈ స‌క్సెస్‌ను ప్రశాంత్ నీల్ కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 1తో కంటిన్యూ చేయ‌డం విశేషం. మరిప్పుడు ఈ ద‌ర్శ‌కులు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.
    Published by:Anil
    First published: