ఇంత పెద్ద మాట ఎవరన్నారబ్బా అనుకుంటున్నారా..? ఐస్ క్రీమ్ సినిమాతో అందాలన్నీ ఆరబోసిన తేజస్వి ఈ మాటలు అనేసింది. ఇండస్ట్రీలో డేట్ చేద్దాం అని అడిగే వాళ్ల కంటే కూడా ఐస్ క్రీమ్ కావాలా అని అడిగే వాళ్లు ఎక్కువగా ఉంటారు. అదే కాస్టింగ్ కౌచ్ అంటే.. అసభ్యకరమైన మాటలతో టార్చర్ చేసే వాళ్లు ఇక్కడ ఎక్కువగా ఉంటారని చెప్పుకొచ్చింది. టాలీవుడ్లో తనను చాలా మంది కమిట్మెంట్ అడిగారని కుండ బద్ధలు కొట్టేసింది తేజస్వి. ఒక్క ముక్కలో చెప్పాలంటే 90 శాతం ఇక్కడ పడుకోనిదే పనులు జరగవని ఓపెన్‌గానే చెప్పేసింది ఈ బిగ్ బాస్ బ్యూటీ. ఈమె నటించిన కమిట్మెంట్ సినిమా టీజర్ ఆ మధ్య విడుదలైంది. లక్ష్మీకాంత్ చెన్నా తెరకెక్కించిన ఈ టీజర్ ఆసక్తికరంగానే ఉంది. పైగా ఇది తన కథలాగే ఉందని సంచలన కామెంట్స్ చేసింది తేజస్వి. ఇందులో అమ్మాయిలకు అవకాశం రావాలంటే బెడ్రూమ్కు రావాల్సిందే అనే కోణంలో చూపించారు. ఆ తర్వాత సందేశం కూడా ఇచ్చాడు దర్శకుడు. తన విషయంలో కూడా చాలా మంది అవకాశం కోసం తమ కామ వాంఛ తీర్చమని కోరారని చెప్పింది తేజస్వి. వాటిని ఒప్పుకోలేక తాను చాలా సినిమాలకు దూరం అయ్యానని.. ఈ మధ్య అస్సలు నటించడం కూడా మానేసానని చెప్పుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్లు ముందుగానే కమిట్మెంట్కు ప్రిపేర్ అయి వస్తున్నారని మరో సంచలన విషయం కూడా చెప్పింది తేజస్వి. ఈ రోజుల్లో అవకాశాలు రావాలంటే కమిట్మెంట్ అనేది అవసరం అంటుంది ఈ బ్యూటీ. ఆ క్యాటగిరీలో ఉంటే అవకాశాలు వస్తాయి లేదంటే అలా చూస్తూ ఉండిపోవాల్సిందే అంటుంది తేజస్వి. తనలా ప్రతిభ ఉండి కూడా రేసులో వెనక బడటానికి కారణం పడుకోడానికి ఒప్పుకోకపోవడమే అంటుంది ఈ ముద్దుగుమ్మ.
బాంబే నుంచి వచ్చే హీరోయిన్స్ దేనికైనా ఒప్పుకొంటారనే ఒకే ఒక్క కారణంతో వాళ్లను తమ సినిమాల్లో పెట్టుకుంటున్నారు అంటుంది. అంటే తన ఉద్దేశ్యం బాలీవుడ్ నుంచి వచ్చే వాళ్లంతా అలాగే ఉంటారని కాదు.. కొందరి వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందనేది గమనించాలని చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలుగు అమ్మాయిలకు తమిళ అమ్మాయిలకు కూడా తెలుసంటుంది తేజస్వి మదివాడ. ఈ కాస్టింగ్ కౌచ్‌తో తన వ్యక్తిగత జీవితాన్ని కూడా కోల్పోయానని.. గతంలో తనకు ఒకరితో అఫైర్ ఉండేదని.. అతడితో పెళ్లికి కూడా సిద్ధమయ్యానని.. కానీ సినిమా నుంచి వచ్చాననే ఒకే ఒక్క కారణంతో అతడు తనపై అనుమానపడి దూరంగా పెట్టాడని చెప్పింది.
వర్మ సినిమాలో నటించావు.. నువ్వు అలాంటి పనులు చేయలేదంటే ఎలా నమ్మమంటావని తనపై అనుమానంతో దూరం చేసుకున్నాడని చెప్పింది. తాను అలాంటి దాన్ని కాదని ఎలా నిరూపించుకోవాలో తెలియలేదని వాపోయింది తేజస్వి. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కోవడం కంటే దూరంగా ఉండటమే మంచిదని చెప్పింది ఈమె.
తనకు ఆ మధ్య బాలీవుడ్లో నవాజుద్దీన్ సిద్ధిఖీతో ఓ వెబ్ సిరీస్‌లో నటించే ఆఫర్ వచ్చినా కూడా అందులో నగ్నంగా నటించాలని కోరడంతో నో చెప్పినట్లు చెప్పింది ఈ ముద్దుగుమ్మ. అశ్లీల పాత్రలు, కమిట్మెంట్ ఉండటంతో తాను ఈ మధ్య కనిపించడం లేదని చెప్పింది ఈ తెలుగమ్మాయి. ప్రస్తుతం లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో కమిట్మెంట్ అనే సినిమాలో నటించింది. ఈ ప్రమోషన్లో భాగంగానే ఇవన్నీ మాట్లాడింది తేజస్వి. ఆ మధ్య టీజర్ లాంఛ్లోనూ ఇదే విషయం చెప్పుకొచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tejaswi madivada, Telugu Cinema, Tollywood