హోమ్ /వార్తలు /సినిమా /

Dancee Plus: ర‌ఘు, బాబా భాస్క‌ర్, య‌శ్‌ మాస్ట‌ర్ స‌హా.. ఢీ, డ్యాన్స్ ప్ల‌స్ షోల‌లో పాల్గొన్న కంటెస్టెంట్లు, మాస్ట‌ర్‌లు వీరే

Dancee Plus: ర‌ఘు, బాబా భాస్క‌ర్, య‌శ్‌ మాస్ట‌ర్ స‌హా.. ఢీ, డ్యాన్స్ ప్ల‌స్ షోల‌లో పాల్గొన్న కంటెస్టెంట్లు, మాస్ట‌ర్‌లు వీరే

బాబా భాస్కర్, రఘు మాస్టర్, యశ్ మాస్టర్

బాబా భాస్కర్, రఘు మాస్టర్, యశ్ మాస్టర్

ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెళ్లలో రియాలిటీ షోల‌కు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా డ్యాన్స్, సింగింగ్, కామెడీ షోల ద్వారా ఎంతోమంది టాలెంట్ బ‌య‌ట‌ప‌డుతుంది. ఇలా షోల్లో ఆద‌ర‌ణ సంపాదించి.. సినిమాల్లోనూ అవ‌కాశాలు పొందిన వారు చాలా మందే ఉన్నారు. క‌మెడియెన్ సునీల్(Sunil) మొద‌లు టాలెంటెడ్ హీరోయిన్‌ సాయి ప‌ల్ల‌వి(Sai Pallavi) వ‌ర‌కు చాలా మంది ఇలా రియాలిటీ షోల‌ నుంచి వచ్చిన వారే.

ఇంకా చదవండి ...

Dhee- Dance Plus: ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెళ్లలో రియాలిటీ షోల‌కు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా డ్యాన్స్, సింగింగ్, కామెడీ షోల ద్వారా ఎంతోమంది టాలెంట్ బ‌య‌ట‌ప‌డుతుంది. ఇలా షోల్లో ఆద‌ర‌ణ సంపాదించి.. సినిమాల్లోనూ అవ‌కాశాలు పొందిన వారు చాలా మందే ఉన్నారు. క‌మెడియెన్ సునీల్ మొద‌లు టాలెంటెడ్ హీరోయిన్‌ సాయి ప‌ల్ల‌వి వ‌ర‌కు చాలా మంది ఇలా రియాలిటీ షోల‌ నుంచి వచ్చిన వారే. కాగా ఇటీవ‌ల కాలంలో డ్యాన్స్ షోల‌కు మంచి డిమాండ్ పెరిగింది. దీంతో ప్ర‌తి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెళ్‌లోనూ ఓ డ్యాన్స్ షోను న‌డుపుతున్నారు. ఇలా ఈటీవీలో కొన్ని సంవ‌త్స‌రాలుగా ఢీ షో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం అక్క‌డ ఢీ 13వ సీజ‌న్ జ‌రుగుతోంది. ఇక ఇటీవ‌ల‌ స్టార్ మాలో డ్యాన్స్ ప్ల‌స్ అనే షో అట్ట‌హాసంగా ప్రారంభం అయ్యింది. ర‌ఘు, బాబా భాస్క‌ర్, య‌శ్, ఆనీ, ముమైత్ ఖాన్‌, మోనాల్ ఈ షోకు జ‌డ్జిలుగా ఉన్నారు. ఇందులో సోలో, డ్యూయ‌ట్, గ్రూప్ కేట‌గిరిల‌లో పోటీలు జ‌రుగుతున్నాయి. ఇదిలా ఉంటే అంత‌కుముందు ఢీ షోలో క‌నిపించిన కొంద‌రు.. ఇప్పుడు డ్యాన్స్ ప్ల‌స్ షోల‌లో కూడా చేస్తున్నారు. ఆ లిస్ట్‌ని చూస్తే..

బాబా భాస్కర్ మాస్ట‌ర్ః

కొన్నేళ్లుగా మంచి డ్యాన్స్ మాస్ట‌ర్‌గా పేరొందిన బాబా భాస్క‌ర్ మాస్ట‌ర్ ఢీ సీజ‌న్ 1, 2లో కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. అయితే ఏ సీజ‌న్ టైటిల్‌ని గెలుచుకోలేదు. ఆ త‌రువాత ఢీ ప‌లు సీజ‌న్‌ల‌లో జ‌డ్జిగా ప‌నిచేశారు.

ర‌ఘు మాస్ట‌ర్ః

స్టైలిష్ కొరియోగ్రాఫ‌ర్‌గా పేరును సంపాదించుకున్న ర‌ఘు మాస్ట‌ర్.. ఢీ 3లో కొరియోగ్రాఫ‌ర్‌గా చేశారు. అంతేకాదు ఆ సీజ‌న్ టైటిల్ ర‌ఘు మాస్ట‌ర్ కంటెస్టెంట్ స‌త్య‌కు రావ‌డం విశేషం. వెంట‌నే రఘు మాస్ట‌ర్‌కి సినిమాల్లోనూ మంచి ఆఫ‌ర్లు వ‌చ్చాయి.

య‌శ్ మాస్ట‌ర్ః

ఇప్పుడున్న మాస్ట‌ర్‌ల‌లో బాగా వినిపిస్తున్న పేరు య‌శ్ మాస్ట‌ర్. ప్ర‌స్తుతం డ్యాన్స్ ఫ్ల‌స్ షోలో జ‌డ్జిగా వ్య‌వ‌హరిస్తోన్న య‌శ్ మాస్ట‌ర్‌కి ఢీతో మంచి అనుబంధం ఉంది. ఢీ జూనియ‌ర్స్ 2, ఢీ జోడి, ఢీ చాంపియ‌న్స్‌, ఢీ10లలో య‌శ్ మాస్ట‌ర్ కొరియోగ్రాఫ‌ర్‌గా చేశారు. అందులో మూడు సార్లు య‌శ్ మాస్ట‌ర్ కంటెస్టెంట్‌లే విజేత‌లుగా నిలిచారు.

ప్ర‌దీప్ః

ప్ర‌స్తుతం డ్యాన్స్ ఫ్ల‌స్ షోలో సంకేత్‌కి కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తోన్న ప్ర‌దీప్‌.. ఢీ 10, ఢీ చాంపియ‌న్స్‌లో కంటెస్టెంట్‌గా చేశారు. అయితే ఏ ఒక్క సీజ‌న్‌లోనూ టైటిల్ గెల‌వ‌క‌పోయినప్ప‌టికీ.. ప్ర‌స్తుతం మాస్ట‌ర్‌గా స‌త్తా చాటాల‌నుకుంటున్నాడు.

సంకేత్ః

ప్ర‌స్తుతం డ్యాన్స్ ప్ల‌స్ షోలో కంటెస్టెంట్‌గా ఉన్న సంకేత్.. ఢీ జోడీలో క‌నిపించారు. య‌శ్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో ప్రియాంక‌తో క‌లిసి ఆ సీజ‌న్ విజేత‌గా కూడా నిలిచాడు.

జియా ఠాకూర్ః

డ్యాన్స్ ప్ల‌స్ షోలో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న జియా ఠాకూర్.. ఢీలోనూ పాల్గొంది. ఢీ జూనియ‌ర్స్‌లో మ‌నోజ్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో మంచి మంచి డ్యాన్స్ ప‌ర్ఫామెన్స్‌లు ఇచ్చి గుర్తింపు సంపాదించుకున్నారు జియా.

ప్రియాంకః

డ్యాన్స్ ప్ల‌స్ షోలో ఎమ్ఎమ్‌కే టీమ్‌కి కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తోన్న ప్రియాంక‌.. ఢీ జోడీలో కంటెస్టెంట్‌గా పోటీ ప‌డ్డారు. య‌శ్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో సంకేత్‌తో కలిసి సీజ‌న్ విజేత‌గా నిలిచారు.

ఎమ్ఎమ్‌కే టీమ్ః

డ్యాన్స్ ప్ల‌స్ షోలో గ్రూప్ ఫ‌ర్ఫామ‌ర్ లిస్ట్‌లో ఉన్న ఎమ్ఎమ్‌కేలోని మాన‌సి, మ‌యూరి, కేశ‌వి ముగ్గురు ఢీ ఛాంపియ‌న్స్‌లో కంటెస్టెంట్‌లుగా చేశారు. ప్ర‌స్తుతం ఈ ముగ్గురు టీమ్‌గా పోటీ ప‌డుతున్నారు.

First published:

Tags: Star Maa, Television News

ఉత్తమ కథలు