Hema Malini: హేమా మాలినికి కరోనా పాజిటివ్.. ? క్లారిటీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్..

ప్రస్తుతం కరోనా మహామ్మారి ప్రపంచ వ్యాప్తంగా అందరినీ కలవర పాటుకు గురి చేస్తోంది. ఇప్పటికే అమితాబ్ ఫ్యామిలీ మెంబర్స్ కరోనా సోకింది. అది మరవక ముందే హేమా మాలిని కరోనా పాజిటివ్ వచ్చిందంటూ...

news18-telugu
Updated: July 13, 2020, 9:00 AM IST
Hema Malini: హేమా మాలినికి కరోనా పాజిటివ్.. ?  క్లారిటీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్..
హేమా మాలిని (File Photo)
  • Share this:
ప్రస్తుతం కరోనా మహామ్మారి ప్రపంచ వ్యాప్తంగా అందరినీ కలవర పాటుకు గురి చేస్తోంది. దీనికి పేద, గొప్పా అనే తేడా లేదు. నిన్నటి వరకు మన దేశంలో సామాన్య జనాలకు మాత్రమే పరిమితమైన కరోనా..  ఆ తర్వాత అత్యవసర సేవలు అందించే  వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, మీడియా వాళ్లు కరోనా కాటు వేసింది. ఆపై పలువురు రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడ్డారు. అటు చిత్ర సీమలో పలువురు కరోనా బారినా పడ్డ.. మన దేశంలోనే అతి పెద్ద సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు కరోనా రావడం సినీ, రాజకీయ వర్గాల పాటు అందరినీ కలవర పాటుకు గురి చేసింది. అటు అమితాబ్‌తో పాటు ఆయన తనయుడు హీరో అభిషేక్ బచ్చన్, కోడులు ఐశ్వర్యారాయ్ బచ్చన్, మనవరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. అటు అమితాబ్ భార్య జయా బచ్చన్‌కు నెగిటివ్ వచ్చింది. తాజాగా ఒకప్పటి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమా మాలినికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

How Cinema Actors Turn into politics Like NTR,Chiranjeevi,Balakirshna,Pawan kalyan,IPL,IPL 2019,jabardasth comedy show,nagababu,Andhra Pradesh News,Telangana News,Andhra pradesh Politics,Telangana Politics,NTR,chiranjeevi amitabh bachchan shatrugan sinha politics,Rajini kanth kamal haasan khushbu nagma politics,Senior NTR Telangana Politics,NTR Andhra Pradesh politics,Chiranjeevi Telangana Politics,Pawan kalyan Telangana politics,Chiranjeevi Andhra pradesh Politics,Pawan Kalyan Andhra pradesh Politics,iNTR Chiranjeevi Pawan Kalyan Telangana Andhra pradesh Politics,TDP,Janasena,Prajarajyam,ఎన్టీఆర్,సీనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ తెలంగాణ పాలిటిక్స్,చిరంజీవి తెలంగాణ పాలిటిక్స్,చిరంజీవి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్,ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్,పవన్ కళ్యాణ్ తెలంగాణ పాలిటిక్స్,బాలకృష్ణ టీడీపీ తెలుగు దేశం,ఎన్టీఆర్,పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్,జబర్ధస్త్ రోజా,విజయశాంతి,బాబు మోహన్,కోట శ్రీనివాస రావు పాలిటిక్స్,అమితాబ్ బచ్చన్ పాలిటిక్స్,శతృఘ్న సిన్హా స్మృతి ఇరానీ మూన్ మూన్ సేన్ పాలిటిక్స్, దేవానంద్,కమల్ హాసన్ రజినీకాంత్ ఎమ్జీఆర్ శివాజీ గణేషణ్ కార్తీక్,సునీల్ దత్,ఎన్టీఆర్ చిరంజీవి పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా, tollywood News,Telugu cinema
హేమామాలిని (File/Photo)


హేమా మాలిని గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌లో తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాదు తెలుగులో కూడా ఈమె పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువ అయ్యారు. ఐతే..హేమా మాలిని.. ఏదో జనరల్ చెకప్ కోసం హాస్పిత్రిలో జాయిన్ కావడంతో ఆమెకు కరోనా పాజిటివ్ అనే రూమర్స్ వ్యాప్తి చెందాయి. దీనిపై హేమా మాలిని కూతురు ఈషా డియోల్ స్పందించింది. ఒంట్లో నలతగా ఉండటంతో అమ్మ హాస్పిటల్‌లో జాయిన్ అయింది. ఆమెకు కరోనా సోకలేదని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు తమ కుటుంబంపై చూపిస్తోన్న ప్రేమకు అభిమానులకు, నెటిజన్లకు కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు హేమా మాలిని తన అనారోగ్యంపై వస్తున్న వార్తలపై స్పందించడమే కాదు.. ఏకంగా ఓ వీడియోను షేర్ చేసింది.మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. ఆ కృష్ణ పరమాత్ముడి దయ వల్ల  నేను ఆరోగ్యంగానే ఉన్నాను. రాధే రాధే.. అంటూ అందరు ఇంటి పట్టునే ఉండండి. అత్యవసర పనులు ఉంటేనే బయటకు వెళ్లండి అంటూ చెప్పుకొచ్చింది. మొత్తంగా హేమా మాలని తనకు కరోనా సోకలేదని చెప్పడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 13, 2020, 9:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading