హోమ్ /వార్తలు /సినిమా /

Hello Meera: డైరెక్టర్ వీవీ వినాయక్ చేతుల మీదుగా హలో మీరా ట్రైలర్ రిలీజ్

Hello Meera: డైరెక్టర్ వీవీ వినాయక్ చేతుల మీదుగా హలో మీరా ట్రైలర్ రిలీజ్

Hello Meera trailer release News 18

Hello Meera trailer release News 18

Hello Meera Trailer: హలో మీరా అనే టైటిల్ తోనే ఆడియన్స్ దృష్టిని తన సినిమా వైపు మరల్చుకున్న యూనిట్.. రీసెంట్ గా వదిలిన పోస్టర్స్, టీజర్ తో అంచనాలు పెంచేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సింగిల్ క్యారెక్టర్‌తో ఓ డిఫరెంట్ మూవీ రూపొందించి తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలనే సంకల్పంతో హలో మీరా (Hello Meera) సినిమా రూపొందిస్తున్నారు దర్శకుడు కాకర్ల శ్రీనివాసు (Kakarla Srnivasu). ప్రముఖ దర్శకులు శ్రీ బాపు (Bapu) గారితో పలు సినిమాలకు సహ దర్శకుడిగా పని చేసిన అనుభవాన్ని రంగరించి ఈ ప్రయోగాత్మక సినిమాను తెరకెక్కిస్తున్నారు. హలో మీరా అనే టైటిల్ తోనే ఆడియన్స్ దృష్టిని తన సినిమా వైపు మరల్చుకున్న యూనిట్.. రీసెంట్ గా వదిలిన పోస్టర్స్, టీజర్ తో అంచనాలు పెంచేశారు.

హలో మీరా అనేది ఓ కొత్త తరహా థ్రిల్లింగ్ మూవీ అని ప్రేక్షకుల్లో ఓ భావన నెలకొల్పిన చిత్రయూనిట్.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. డైనమిక్ డైరెక్టర్ వీవీ వినాయక్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ వదిలారు. ట్రైలర్ వీడియో చూసిన డైరెక్టర్ వీవీ వినాయక్ ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బాగా వచ్చిందని అన్నారు. కేవలం సింగిల్ క్యారెక్టర్ తీసుకొని ఇంత థ్రిల్ చేసే సినిమా తీయడమనేది ఓ సవాల్‌తో కూడిన పని అని, అందులో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని ఈ ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తోందని అన్నారు. ఈ సినిమా బిగ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు వీవీ వినాయక్.

2 నిమిషాల 26 సెకనుల నిడివితో కట్ చేసిన ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా ఉంది. సినిమాలోని మీరా అనే సింగిల్ క్యారెక్టర్ ని చూపిస్తూ జీవితంలో చేసిన ఓ చిన్న తప్పు ఆమెకు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? కుటుంబం, పెళ్లి, స్నేహితులు, పోలీసులు ఇలా డిఫరెంట్ యాంగిల్స్ లో మీరాకు వచ్చిన చిక్కులేంటి? అనేది ఈ సినిమాలో చూపించనున్నారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న మీరా అనే క్యారెక్టర్ తోనే ఈ ట్రైలర్ రూపొందించి సినిమాపై ఆసక్తి మరింత పెంచేశారు మేకర్స్.' isDesktop="true" id="1491832" youtubeid="n-oFKMtXCkE" category="movies">

ఎలాంటి భారీ తారాగణాన్ని ఎంచుకోకుండా ప్రయోగాత్మక కథతో ఈ మూవీ ప్లాన్ చేశారని ఈ ట్రైలర్ స్పష్టం చేసింది. వైవిద్యభరితమైన కథలో ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను థ్రిల్ చేసే సినిమానే ఈ హలో మీరా అని తాజాగా వదిలిన ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి రాత్రికి రాత్రి ఆ పెళ్లి కాదనుకొని కారులో హైదరాబాద్ బయల్దేరడం, ఆ తర్వాత మీరా పరిస్థితి ఎలా ఉంది? అనే కాన్సెప్ట్ ఈ సినిమాకు మేజర్ అసెట్ కానుందని తెలుస్తోంది.

లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో మీరాగా గార్గేయి యల్లాప్రగడ నటించారు. డా : లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మాతలుగా వ్యవహరించగా.. ఎస్ చిన్న సంగీతం అందించారు. ప్రశాంత్ కొప్పినీడి సినిమాటోగ్రఫీ అందించారు. అనంత శ్రీధర్ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. తిరుమల ఎం తిరుపతి పొడక్షన్ డిజైనర్ గా, కత్రి మల్లేష్ , M రాంబాబు [చెన్నై] ప్రొడక్షన్ మేనేజర్స్ గా పని చేశారు. హిరన్మయి కళ్యాణ్ మాటలు రాశారు. రాంబాబు మేడికొండ ఎడిటర్ గా వర్క్ చేశారు. ప్రశాంత్ కొప్పినీడి అందించిన విజువల్స్ సినిమాలో హైలైట్ కానున్నాయట. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

First published:

Tags: Tollywood, Tollywood actor, VV Vinayak

ఉత్తమ కథలు