హోమ్ /వార్తలు /సినిమా /

సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్న హెబ్బా పటేల్ ''తెలిసినవాళ్ళు'' టీజర్

సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్న హెబ్బా పటేల్ ''తెలిసినవాళ్ళు'' టీజర్

Telisinavallu Photo Twitter

Telisinavallu Photo Twitter

Hebah Patel: ''తెలిసినవాళ్ళు'' సినిమా టీజర్ కి భారీ స్పందన దక్కుతుండటం పట్ల చిత్ర యూనిట్ ఖుషీ అవుతోంది. తమ సినిమా టీజర్ ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్పెషల్ థాంక్స్ చెబుతున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఈ రోజుల్లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు సూపర్ డిమాండ్ దక్కుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకొని తెరకెక్కిస్తున్న సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. స్టార్ కాస్ట్ లేకపోయినప్పటికీ సినిమాలో కథ, కథాంశం బలంగా ఉంటే మూవీ సూపర్ సక్సెస్ అవుతోంది. అలాంటి బాటలోనే తమ సినిమా ఉంటుందని తెలిసేలా రీసెంట్ గా తెలిసినవాళ్ళు టీజర్ (Telisinavallu teaser) రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ టీజర్ కి భారీ స్పందన దక్కుతుండటం పట్ల చిత్ర యూనిట్ ఖుషీ అవుతోంది. తమ సినిమా టీజర్ ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్పెషల్ థాంక్స్ చెబుతున్నారు.

  సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో విప్లవ్ కోనేటి దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రం ''తెలిసినవాళ్ళు'' . విభిన్న కథాంశంతో రొమాన్స్, ఫ్యామిలీ, థ్రిల్లర్ జోనర్స్ కలసిన ఒక కొత్త తరహా కథనంతో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా రామ్ కార్తీక్ (Ram Karthik) నటిస్తుండగా అతని సరసన హీరోయిన్ పాత్రలో హేబా పటేల్ (Telisinavallu teaser) నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల (Sri Charan Pakala) సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

  ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.. ఇందులో భాగంగా ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచేశారు. ఇది వరకే జల్సా చిత్రం రీ రిలీజ్ షోస్ లో భాగంగా ఈ చిత్ర టీజర్ ను ప్లే చేసారు. అప్పుడు కూడా ఈ చిత్ర టీజర్ కు విశేష స్పందన లభించింది.

  ఫ్యామిలీ సూసైడ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్ర టీజర్ ఆద్యంత ఆసక్తికరంగా ఉంది. కొన్ని యదార్థ సంఘటనలు బట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మరిన్ని అప్డేట్స్ ను , రిలీజ్ ను అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం. చిత్రంలో రామ్ కార్తీక్, హెబ్బా పటేల్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ తదితరులు నటించారు.

  Published by:Sunil Boddula
  First published:

  Tags: Hebah patel, Tollywood, Tollywood actress

  ఉత్తమ కథలు