హోమ్ /వార్తలు /సినిమా /

Geetha: సునీల్, హెబ్బా పటేల్ నటిస్తున్న గీత రిలీజ్ డేట్ ఫిక్స్.. !

Geetha: సునీల్, హెబ్బా పటేల్ నటిస్తున్న గీత రిలీజ్ డేట్ ఫిక్స్.. !

గీత రిలీజ్ డేట్ ఫిక్స్

గీత రిలీజ్ డేట్ ఫిక్స్

సెన్సార్ సహా అన్ని కార్య్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 26న విడుదల కానుంది. ఈ సినిమాలో క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సంచలన దర్శకులు వి.వి.వినాయక్ ప్రియశిష్యుడు "విశ్వ"ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... వి.వి.వినాయక్ ఆశీస్సులతో "గ్రాండ్ మూవీస్" పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం "గీత". "మ్యూట్ విట్నెస్" అన్నది ఉప శీర్షిక. సెన్సార్ సహా అన్ని కార్య్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 26న విడుదల కానుంది. ఈ సినిమాలో క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేశారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్యపాత్ర పోషించగా.. "నువ్వే కావాలి, ప్రేమించు" వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ విలన్ గా నటించారు.

ఈ చిత్రం విడుదల సందర్భంగా దర్శకుడు విశ్వ మాట్లాడుతూ... "ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అన్నారు. నిర్మాత ఆర్.రాచయ్య మాట్లాడుతూ... "గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ... "గీత" చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడన్నారు. ఈనెల 26న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని తెలిపారు.

రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి (30 ఇయర్స్), తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్, సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఇక గీత చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: విక్రమ్ రమేష్‌ పనిచేశారు. ఈ సినిమాలో డాన్స్ అనీష్ అందించారు. పాటలు.. సాగర్, సంగీతం సుభాష్ ఆనంద్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్..  ఎస్.చిన్నా అందించారు. కెమెరా మ్యాన్‌గా క్రాంతికుమార్.కె, కూర్పు.. ఉపేంద్ర, కో-డైరెక్టర్‌గా వి.వి.రమణ పనిచేశారు. నిర్మాత.. ఆర్.రాచయ్య అయిన గీత చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విశ్వ చూసుకున్నారు.

First published:

Tags: Comedian Sunil, Hebah patel

ఉత్తమ కథలు