సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇప్పటి నుంచి ప్రతీ గంట కూడా కీలకమే అన్నారు. కృష్ణ ఆరోగ్యం కాస్త నిలకడగా ఉన్నప్పటికీ... విషమంగానే ఉందన్నారు. 48 గంటలవరకు ఏం జరుగుతుందో చెప్పాలేమన్నారు డాక్టర్లు. కృష్ణ శరీరం సహకరించే దాని బట్టి వైద్యం అందిస్తామన్నారు. ఆయన కోలుకోవాలని అందరం ప్రార్థిద్ధాంమన్నారు.
ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ పై కృష్ణకు చికిత్స కొనుసాగుతోందని తెలిపారు. గుండెపోటుతో స్పృహ లేని పరిస్థితుల్లో కృష్ణను అర్థరాత్రి ఆస్పత్రికి తీసుకొచ్చామన్నారు. తీసుకొచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయనకు వైద్యం అందించామన్నారు. 20 నిమిషాల పాటు సీపీఆర్ చేసి గుండెపోటు నుంచి బయటపడేలా చేశామన్నారు డాక్టర్ గురు ఎన్ రెడ్డి. 24 గంటల తర్వాత మళ్లీ హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Krishna, Mahesh Babu, Super Star Krishna