మహేష్ నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రమోషన్స్‌ను స్పీడప్ చేసింది చిత్ర యూనిట్. ఈ మూవీ నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. సరిలేరు నీకెవ్వరు, మైండ్ బ్లాక్, సూర్యుడు చంద్రుడు సాంగ్స్‌కు ఫ్యాన్స్ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక తాజాగా మరో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. 'హి ఈజ్ సో క్యూట్' అంటూ సాంగే ప్రోమోను కాస్త వెరైటీగా రిలీజ్ చేశారు. ఆ పాటకు హీరోయిన్ రష్మిక మందన్న డాన్స్ చేస్తున్న వీడియోను టిక్ టాక్‌లో విడుదల చేశారు.
'హీ ఈజ్ సో క్యూట్' పాటకు రష్మిక మందన్న అద్దిరిపోయే స్టెప్పులేసింది. ఆమె డ్యాన్స్‌కు మహేష్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక డిసెంబరు 16 సాయంత్రం 05.04 గంటలకు ఫుల్ సాంగ్‌ని రిలీజ్ చేయబోతోంది చిత్ర యూనిట్. కాగా, సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 11న విడుదల కానుంది. సినిమాలో మహేష్ బాబు ఫస్ట్ టైమ్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం ద్వారా విజయశాంతి టాలీవుడ్లో సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.