Tejaswi Madivada : బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో సందడి చేసిన భామ తేజస్వి.. ఆ షోలో తన అందచందాలతో పాటు అల్లరితో కుర్రకారులో యమ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు ఈ భామ కేరింత, ఐస్ క్రీమ్, జత కలిసే సినిమాల్లో నటించి తన అందాలతో అదరగొట్టింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలో నటిస్తోన్న ఈ భామ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఓ చిన్న పాత్ర ద్వారా టాలీవుడ్ కి పరిచమైంది. ఆ తరువాత ఐస్ క్రీమ్ అనే హారర్ రొమాంటిక్ డ్రామాలో బోల్డ్ రోల్ చేసింది. ఈ మూవీకి వర్మ దర్శకుడు కావడం విశేషం. చాలా సినిమాల్లో మంచి పాత్రలు చేసిన తేజస్వికి ఇంకా హీరోయిన్ గా మాత్రం సరైన బ్రేక్ రాలేదు. ప్రస్తుతం ఈ భామ కమిట్మెంట్ అనే ఓ సినిమాలో బోల్డ్‌గా కనిపించనుంది. లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వం వహిస్తున్నారు.
Team Commitment wishes the gorgeous @TejaswiMadivada a very Happy Birthday❤️🤗
A film by @Lakshmmikanth
*ing #AmitTiwari @ramyapasupulet1 @AbhayReddy @SuryaSreenivasP @maganti_srinath @ursimarsingh #AnveshiJain pic.twitter.com/SXf12oblVB
— Telugu FilmNagar (@telugufilmnagar) July 3, 2020
ఈ సినిమాలో ముఖ్యంగా సినీ పరిశ్రమలో హీరోయిన్స్ పడే ఇబ్బందులు, వారు ఎదుర్కోనే వేధింపులు, ఎలా మోసగిస్తారో.. ఇలా పలు అంశాలను చర్చించనున్నారు. ఇక ఈరోజు తేజస్వి తన 29వ పుట్టిన రోజును జరుపుకుంటున్న సందర్భంగా ఆ సినిమా నుండి ఈ భామకు సంబందించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tejaswi madivada, Tollywood news